Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్‌ జ్యూస్‌కి కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి...

Advertiesment
క్యారెట్‌ జ్యూస్‌కి కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి...
, శనివారం, 22 డిశెంబరు 2018 (19:52 IST)
కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చిగా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయి. ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయి. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. విటమిన్లు, ఖనిజాలు క్యారెట్లో అధికంగా ఉంటాయి. తాజా క్యారెట్లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాలు ఉంటాయి. క్యారెట్ విటమిన్ బి, సి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది.
 
2. క్యారెట్ పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైనది.
 
3. ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమే కాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.
 
4. తాజా క్యారెట్‌ జ్యూస్‌కు కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి శిరోజాలకు పట్టించి కొద్దిసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలడం తగ్గడమే కాక, శిరోజాలు గట్టిగా వుంటాయి. జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే క్యారెట్‌ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లయితే జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
 
5.  క్యారెట్టులో విటమిన్ ఏ, బీ, ఇ తోపాటు పలు మినరల్స్ ఉండటం మూలాన కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుకోవచ్చు. కంటి చూపు మెరుగుపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవ్వలో ఉప్పు కలిపి తింటే..?