Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోరింటాకు పొడి, నిమ్మరసం తలకు పట్టిస్తే..?

గోరింటాకు పొడి, నిమ్మరసం తలకు పట్టిస్తే..?
, శనివారం, 22 డిశెంబరు 2018 (10:55 IST)
చాలామందికి తలలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఆ చుండ్రును తొలగించుకోవడానికి ఏవేవో నూనెను, షాంపూలు వాడుతుంటారు. అయిన కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఇప్పటి చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కింది చిట్కాలు పాటిస్తే.. చుండ్రు సమస్య నుండి తెలిగ్గా బయటపడొచ్చని చెప్తున్నారు.. అవేంటో చూద్దాం..
 
1. కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్యపోతుంది.
 
2. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీరు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. షాంపూకు బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఉండే క్రిములను తొలగిస్తుంది. దాంతో చుండ్రు కూడా పోతుంది.
 
3. గోరింటాకు పొడిలో 5 స్పూన్ల చక్కెర, స్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండవు.
 
4. ఓ పాత్రలో గులాబీ ఆకులను మరిగించుకోవాలి. అనంతరం ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాటేస్తున్న కేన్సర్ : యేడాదిలో 8.1 లక్షల మంది మృతి