Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-11-2023 - సోమవారం మీ రాశి ఫలితాలు.. ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు దూరంగా..?

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (05:02 IST)
శంఖరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం:- మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. స్త్రీలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. 
 
వృషభం:- ఒక శుభకార్యం దగ్గర పడుతున్నకొద్ది మీలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ అభిప్రాయాలు, భావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి.
 
మిధునం:- క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో ఊహించని చికాకు లెదురవుతాయి. ఖర్చులు సామాన్యం. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కర్కాటకం:- పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్పెక్యులేషన్ విషయంలో మీ అంచనాలు ఫలించవు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం వంటి శుభ పరిణామా లుంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం:- అతిధి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఊహించని ఖర్చుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. శుభకార్యాల్లో స్త్రీలు అందరినీ ఆకట్టుకుంటారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
కన్య:- చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఆత్మీయుల అతిధి మర్యాదలు సంతృప్తినిపస్తాయి. బీమా, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కాంట్రాక్టులు, ఏజెన్సీలు, లీజులకు సంబంధించిన వ్యవహరాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
తుల:- ఆత్మీయుల గురించి ఆందోళనచెందుతారు. మొండి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆశాజనకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకువస్తాయి.
 
వృశ్చికం:– ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఏమరు పాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. ధనం బాగా వెచ్చించినా ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ధనస్సు:- సర్టిఫికెట్లు,విలువైన పత్రాలు అందుకుంటారు. ప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్లో జాప్యం తప్పదు. వృత్తుల వారికి కొన్ని ప్రతికూలత లెదురవుతాయి.
 
మకరం:- మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడ్డారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసివస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
కుంభం:- సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వృత్తులు, నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. మీ వాగ్ధాటితో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఆత్మీయుల సహకారంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.
 
మీనం:- పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments