Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-11-2023 శనివారం దినఫలాలు - లక్ష్మీనారాయణస్వామిని ఎర్రని పూలతో పూజించిన సర్వదా శుభం...

Advertiesment
horoscope
, శనివారం, 25 నవంబరు 2023 (04:01 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ త్రయోదశి సా. 4.36 అశ్వని ప.2.58 ఉ.వ.11.09 ల 12.40 రా.వ.12.15 ల 1.48. ఉ.దు. 6.03 ల 7.34.
లక్ష్మీనారాయణస్వామిని ఎర్రని పూలతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మనుముందు మంచి ఫలితాలనిస్తాయి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవకార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
వృషభం :- నూతన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దంపతుల ఆలోచనలు పరస్పరం సానుకూలంగానే ఉంటాయి. 
 
మిథునం :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించి మీ పసులు సానుకూలం చేసుకుంటారు. 
 
కర్కాటకం :- దంపతుల మధ్య మనస్పుర్థలు తలెత్తుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. ద్విచక్ర వాహనం నడుపునపడు మెళుకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. 
 
సింహం :- స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలెదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. ఆప్తులను సంప్రదించి కొన్ని కార్యక్రమాలు నిర్ణయాలకు తీసుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. మొహమ్మాటాలకు పోయి ధనం విపరీతంగా వ్యయం చేయవలసివస్తుంది. అనుబంధాల్లో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రతి విషయాన్ని ఆప్తులు, కుటుంబీకులకు తెలియజేయటం మంచిది.
 
తుల :- విదేశాలు వెళ్ళాలనే కోరిక అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ శక్తిసామర్ధ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. మీ దురదృష్టానికి మిమ్ములను మీరే నిందించుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తి నీయవు. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు :- సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు పనివారాలతో చికాకులు, అసహనం తప్పవు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు. అధికమవుతున్నారని గమనించండి. ఊహించని ఖర్చులు అధికం అవడం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
మకరం :- మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు విరమించుకోవటం క్షేమదాయకం. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.
 
కుంభం :- వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ హోదా చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సివస్తుంది. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మీనం :- స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలన్న మీ ధ్యేయం నెరవేరగలదు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఆధ్మాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక ప్రదోషం.. అర్థనారీశ్వరుడిగా స్వామిని దర్శించుకుంటే..?