Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-11-2023 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

Advertiesment
Astrology
, గురువారం, 23 నవంబరు 2023 (04:00 IST)
మేషం :- ఆర్థిక సంస్థల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. దైవదీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన కానుకలందిస్తారు.
 
వృషభం :- మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్థులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
మిథునం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పత్రిక, ప్రైవేట్ సంస్థలలో వారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. క్రయవిక్రయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. సోదరులతో ఆస్తి విషయాలు ప్రస్తావిస్తారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక మీ ఉన్నతికి తోడ్పడతాయి. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు ఎంత శ్రమించినను గుర్తింపు ఉండదు. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను అధిగమిస్తారు. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పారిశ్రమికరంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో సమస్యలు తలెత్తుతాయి. 
 
సింహం :- వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహరాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
 
కన్య :- వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కోర్టు వ్యవహరాలు వాయిదాపడటంతో నిరుత్సాహం చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో అవకాశం లభిస్తుంది.
 
తుల :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పొదుపు చేయాలన్న మీ యత్నం ఏ మాత్రం సాధ్యం కాదు. స్త్రీలకు కుటుంబంలోనూ, చుట్టుపక్కల వారిలోను ఆదరణ లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలలో ప్రతికూలత లెదురవుతాయి.
 
వృశ్చికం :- మీ సంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగటంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లోపడే ఆస్కారంఉంది.
 
ధనస్సు :- ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మకరం :- చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా లభించిన ప్రతిఫలం సంతృప్తికరంగా ఉండదు. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
 
కుంభం :- భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలెదురవుతాయి. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. వ్యవసాయ, తోటల రంగాల వారికి చికాకులు తప్పవు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి.
 
మీనం :- కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించటం అన్ని విధాలా శ్రేయస్కరం. కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. విద్యార్థులకు తోటి వారి కారణంగా మాటపడక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు.. ఎప్పటి నుంచో తెలుసా?