Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు.. ఎప్పటి నుంచో తెలుసా?

Advertiesment
Tirumala
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం (నవంబర్ 23-2023) గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ జరుగుతుంది. 
 
24న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి శ్రీతులసి దామోదర పూజ, 29న బుధవారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గోపూజ, డిసెంబర్‌ 10న ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి పూజలు జరుగుతాయి. 
 
తిరుమల వసంతమండపంలో ఈ పూజ జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-11-2023 బుధవారం దినఫలాలు - సుబ్రహణ్యస్వామిని ఆరాధించిన సర్వదా శుభం...