తిరుమలలో మళ్లీ చిరుత భక్తులను భయపెడుతోంది. అలిపిరి మార్గంలో చిరుత పులుల సంచారంతో వణికిపోతున్న జనానికి మళ్లీ షాక్ తప్పలేదు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి చిరుత వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా మాత్రమే తిరుమల కొండమీదకు అనుమతిస్తున్నారు.
తిరుమల నడక మార్గంలో క్రూర జంతువులు ఇటీవల కాలంలో ఎక్కువయిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇటు అలిపిరి మార్గంలోనూ, అటు శ్రీవారి మెట్ల వద్ద చిరుత, ఎలుగుబంట్లు వంటివి కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అందుకే చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.