Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-11-2023 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం...

Advertiesment
astrolgy
, శుక్రవారం, 24 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ ద్వాదశి సా. 6.21 రేవతి సా.4.04 ఉ.శే.వ. 6.14కు
ఉ.దు. 8. 19 ల 9.05 ప.దు. 12.07 ల 12.52.
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. హమీలు, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికం. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
వృషభం :- ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది.
 
మిథునం :- అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి, ప్రశాంతత లభిస్తాయి. ప్రేమికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది. మీ మాటే నెగ్గాలన్న పంతం మంచిదికాదు. రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వాయిదాలు ఒత్తిడి, చికాకు కలిగిస్తాయి.
 
కర్కాటకం :- దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అధికారులకు మీపై గురి కుదురుతుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
సింహం :- ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు.
 
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. రాజకీయనాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుతుగుంది. ముఖ్యులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
తుల :- బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. మందులు, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమాస్తాలకు లాభదాయకంగా ఉండగలదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృశ్చికం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు మంచిగుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక విషయాల్లో మీదే పైచేయి. బిల్డర్లకు పనివారలతో చికాకులు అధికం. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు.
 
ధనస్సు :- వాదోపవాదాలకు, భేషజాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ ఇతరులను అతిగా విశ్వసించటం మంచిది కాదు. వాహనం నడుతున్నపుడు ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మకరం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఓర్పు, లౌక్యం అవసరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆపత్సమయంలో ఒకరిని ఆదుకోవటం వల్ల ఆదరణ, గుర్తింపు లభిస్తాయి.
 
కుంభం :- వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
మీనం :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సాంబంధాలు ఏర్పడతాయి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసీ వివాహం... పచ్చిపాలు సమర్పిస్తే..