అటు టెన్షన్... ఇటు సెల్ఫీ టైమ్, ఒకే ఫ్రేములో బాలయ్య-రోజా(ఫోటోలు)

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (22:07 IST)
సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటు పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర చర్చ, వాగ్వాదం జరిగింది. సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే ఓటింగ్ జరపాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు. అయితే అంతకుముందు మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదానికి దిగారు. టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు కొడాలి నాని యత్నించగా నాని మీదకు దూసుకెళ్ళెందుకు టీడీపీ ఎమ్మెల్సీల ప్రయత్నించారు. దీంతో కౌన్సిల్ పదిహేను నిముషాల పాటు వాయిదా పడింది. అయితే ఈ వ్యవహారం అంతా గమనించేందుకు బాబు మరికొందరు టీడీపీ నేతలతో కలిసి వీఐపీ గ్యాలరీలో కూర్చున్నారు. 
ఇదే వరుసలో బాలకృష్ణ, రోజాతో పాటు ఇతర వైసీపీ సభ్యులు గ్యాలరీలోనే వేచి వున్నారు. 
యాదృచ్ఛికంగా ఒకే గ్యాలరీలో రోజా, బాలకృష్ణ ఉండటంతో సెల్ఫీలతో సందడి చేశారు రోజా. సెల్ఫీలో బాలకృష్ణ, చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కూడా వున్నారు. బాలకృష్ణ, రోజా ఓకే ఫ్రేమ్‌లో వుండటంతో పలువురు ఎమ్మెల్యేలు ఫోజ్‌లు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments