Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముదురు హీరోకు హీరోయిన్ సమస్య?

Advertiesment
ముదురు హీరోకు హీరోయిన్ సమస్య?
, గురువారం, 9 జనవరి 2020 (17:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు ముదురు హీరోలు ఉన్నారు. అలాంటివారిలో ముందు వరుసలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున్, యువరత్న బాలకృష్ణలను చెప్పుకోవచ్చు. ఈ సీనియర్ హీరోలకు ఇపుడు ఓ పెద్ద సమస్యే ఎదురైంది. అదేంటంటే.. వీరితో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూకడుతున్నప్పటికీ.. హీరోయిన్లు మాత్రం ససేమిరా అంటున్నారట. దీనికి కారణం.. ముదురు హీరోలు కావడమే. 
 
తాజాగా టాలీవుడ్ మన్మథుడుగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈయన నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. కొత్త దర్శకుడు సాల్మాన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. కానీ, హీరోయిన్‌ను మాత్రం ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. 
 
దీనికి కారణం.. పలువురు కుర్రకారు హీరోయిన్లను సంప్రదించినప్పటికీ వారు ససేమిరా అన్నారట. ఎందుకంటే తమకంటే రెండుమూడు పదుల వయస్సు ఎక్కువ కావడమేనట. పైగా, ఇలాంటి హీరోలతో నటించడం వల్ల కుర్రహీరోలతో నటించే అవకాశాలను కోల్పోతామని భయపడుతున్నారట. అందుకే నాగార్జునతో కలిసి రొమాన్స్ చేసేందుకు కుర్రకారు హీరోయిన్లు అంగీకరంచడం లేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతలు ఇద్దరు హీరోయిన్లను సంప్రదించగా వారు నిర్మొహమాటంగా నో చెప్పారట. దీంతో మరికొందరు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్టు వినికిడి. ఈ చిత్రం కోసం ఎంపికయ్యే హీరోయిన్ నాగార్జున భార్యగా నటించాల్సివుంది. సో... కుర్రహీరోయిన్లు దొరకని పక్షంలో సీనియర్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#DarbarReview రజనీకాంత్ మోసేశాడు... తలైవా ఫ్యాన్సుకు సంక్రాంతి (video)