Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#DarbarReview రజనీకాంత్ మోసేశాడు... తలైవా ఫ్యాన్సుకు సంక్రాంతి (video)

#DarbarReview రజనీకాంత్ మోసేశాడు... తలైవా ఫ్యాన్సుకు సంక్రాంతి (video)
, గురువారం, 9 జనవరి 2020 (13:57 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9వ తేదీ (గురువారం) రిలీజైంది. రజనీకాంత్ సినిమా రిలీజైన రోజునే కోలీవుడ్ సినీ ప్రేక్షకులు సంక్రాంతి పండుగను అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారు.

ఢిల్లీలో ఎవ్వరికీ భయపడకుండా తిరిగే రౌడీలను ఎన్‌కౌంటర్ చేసి వారి గర్వాన్ని అణగదొక్కే పోలీస్ ఆఫీసరు ఆదిత్యా అరుణాచలానికి ముంబైకి ట్రాన్స్‌ఫర్ వస్తుంది. ముంబైలో డ్రగ్స్ మాఫియా, సెక్స్ రాకెట్, కిడ్నాప్ వంటి అకృత్యాలను నియంత్రించేందుకు ఆదిత్య సిద్ధమవుతారు. 
 
ఈ క్రమంలో ఒక రోజులోనే కొన్ని ముఠాలకు చుక్కలు చూపిస్తాడు. ఈ క్రమంలో ఓ పారిశ్రామిక వేత్త కుమారుడిని ఆదిత్య అరెస్ట్ చేస్తాడు. ఇలా అరెస్టయిన కుమారుడిని విడుదల చేసేందుకు పారిశ్రామిక వేత్త అష్టకష్టాలు పడతాడు. ఈ స్టోరీతో తొలి అర్థభాగం ముగిసిపోతుంది. ఆపై ఆ పారిశ్రామిక వేత్త ఎవరు? అతని కుమారుడు ఎవరు? అనే రహస్యాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
webdunia
 
విశ్లేషణ:
ఈ సినిమా మొత్తాన్ని రజనీకాంత్ తన భుజస్కంధాలపై మోసారు. 70 ఏళ్లలో పూర్తి యాక్షన్ సినిమాలో అద్భుతంగా నటించాడు. నయనతారతో రొమాన్స్, యోగిబాబుతో కామెడీ, కుమార్తె నివేదా ధామస్‌తో సెంటిమెంట్ అంటూ వివిధ కోణాల్లో అదరగొట్టారు. తొలి అర్థభాగంలో యాక్షన్ సన్నివేశాలు, రెండో భాగంలో ఎమోషన్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి రజనీకాంత్ తన ఫ్యాన్సుకు దర్బార్ ద్వారా నటనాపరంగా డబుల్ ట్రీట్ ఇచ్చారనే చెప్పారు. 
 
ఇక నయనతార పాత్ర పరిధి మేరకే. నివేదా థామస్ క్యారెక్టర్ సినిమాకు ఊతమిచ్చింది. ఈ ఛాన్సును నివేదా థామస్ చక్కగా ఉపయోగించుకుంది. అలాగే కమెడియన్ యోగిబాబు హాస్యాన్ని పండించారు. రజనీకాంత్‌పై యోగిబాబు సెటైర్లు వేస్తూ జోకులు పేల్చడం ఆకట్టుకుంటుంది.
webdunia
 
ఇకపోతే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంతోష్ శివన్ కెమెరా పనితనం. ముంబైలోని పలు ప్రాంతాలను మన కళ్లకు కట్టినట్లు చూపించాడు. అనిరుధ్ సంగీతం అద్భుతం. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలోని తొలి అర్థభాగం అద్భుతంగా వున్నప్పటికీ .. రెండో అర్థభాగంలో విలన్‌తో కథానాయకుడు కలిసిపోవడం వంటి సన్నివేశాలు కథగమనాన్ని కాస్త మెల్లగా నడిచేలా చేస్తాయి. 
 
ఇక దర్బార్‌కు విలన్ క్యారెక్టర్ మైనస్సేనని టాక్. క్లైమాక్స్ కూడా దర్బార్‌కు తేలిపోయింది. క్లైమాక్స్‌ను ఇంకా బలంగా చూపెట్టి వుంటే బాగుండేది. మొత్తానికి రజనీకాంత్ ప్రేక్షకులకు ఈ సినిమా పండగలాంటిది. 
 
రేటింగ్ 3.5/5
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపికా పదుకొనె "ఛపాక్" మూవీ రివ్యూ ... కోర్టుకెక్కిన న్యాయవాది