Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీట్రాప్ కేసులో ముగ్గురు కన్నడ హీరోయిన్లు?

Advertiesment
హనీట్రాప్ కేసులో ముగ్గురు కన్నడ హీరోయిన్లు?
, గురువారం, 5 డిశెంబరు 2019 (11:32 IST)
కర్నాటక రాష్ట్రంలో హనీట్రాప్ కేసు కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా. ఈ ముగ్గురు హీరోయిన్లలో ఒకరు సీనియర్ నటికాగా, మరో ఇద్దరు చిన్న నటీమణులు. అయితే, వీరంతా కలిసి పలువురు ప్రజాప్రతినిధులను హనీట్రాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తమ వలలో పడిన నేతలతో శృంగారం జరుపుతూ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతూ ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. 
 
ఇటీవల కర్నాటక రాష్ట్రంలో ఈ హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. లీకైన రాజకీయ నాయకుల శృంగార వీడియోల వెనుక ఓ టాప్ సీనియర్ హీరోయిన్‌తో పాటు, మరో ఇద్దరు నటీమణులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటితో పాటు, ఈమధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో నటించిన మరో ఇద్దరు హీరోయిన్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను హనీట్రాప్ చేశారని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ 25కు పైగా చిత్రాల్లో నటించిందని సమాచారం. మిగతా ఇద్దరిలో ఓ నటి చిన్న సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించగా, మూడో నటి కన్నడతో పాటు ఇతర సినిమాల్లోనూ కనిపించిందట. గత వారం ఈ హనీట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో రాఘవేంద్ర అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
 
రాఘవేంద్ర, తన ప్రియురాలిని, కొందరు అమ్మాయిలను ఎమ్మెల్యేల వద్దకు పంపి వారితో పరిచయాలు పెంచుకున్నాడని పోలీసులు గుర్తించారు. వారిని రహస్యంగా వీడియోలు తీసి, వారి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటకు వచ్చింది. రాఘవేంద్రను, అతని ప్రియురాలినీ విచారించగా, సినీ హీరోయిన్ల ప్రమేయంపై ఉప్పందినట్టు తెలుస్తోంది. దీంతో హీరోయిన్లకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్తిలాంటి కత్రినా వర్కౌట్స్ చూడతరమా?