Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#UnveilingRRRamaRaoHeroine : 20న సస్పెన్స్‌కు తెరదించుతాం...

Advertiesment
#UnveilingRRRamaRaoHeroine : 20న సస్పెన్స్‌కు తెరదించుతాం...
, బుధవారం, 20 నవంబరు 2019 (08:45 IST)
'బాహుబలి' సీక్వెల్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది వేసవి సెలవుల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఆరంభంలోనే దర్శకుడు ఖరారు చేశారు. వీరిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్‌ను, ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ నటి డైసీ ఎడ్గారీ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల రీత్యా డైసీ జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
దీంతో జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ సస్పెన్స్‌కు చిత్రయూనిట్ చెక్ పెట్టనుంది. తారక్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది నవంబర్ 20న ప్రకటించనుంది. అంతేకాదు విలన్‌కు సంబంధించిన వివరాలను కూడా బుధవారమే వెల్లడించనుంది. దీంతో ఇప్పటివరకూ సాగిన ప్రచారాలకు తెరపడే సమయం వచ్చేసింది.
 
కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో‌ పాటు సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా మిగిలిన షూటింగ్ జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ షో ముగిసినా శ్రీముఖికి లక్ లక్కలా అంటుకుంది, జాక్‌పాట్ కొట్టేసిందిగా...