Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతుళ్ళను చంపిన పద్మజ జైల్లో వింత శబ్ధాలు, భయాందోళనలో ఖైదీలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:04 IST)
దేశవ్యాప్తంగా మదనపల్లె జంట హత్యల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నకూతుళ్ళను చంపుకున్న తల్లిదండ్రుల కేసు ఇప్పటికీ ఒక మిస్టరీనే. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు మదనపల్లె సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
 
అయితే గత ఐదురోజుల నుంచి ఇద్దరూ కూడా జైలు శిక్ష అనుభవిస్తుంటే పద్మజ మాత్రం అస్సలు నిద్రపోవడం లేదట. సరిగ్గా అన్నం తినడం లేదట. కలియుగం అంతమవుతోంది. మీరందరూ ఇక ఉండరు అంటూ గట్టిగా కేకలు వేస్తూ వింత శబ్ధాలు చేస్తోందట పద్మజ.
 
సరిగ్గా భోజనం చేయకపోవడం.. నిద్రపోకుండా వుండటంతో పద్మజ ముఖం పూర్తిగా పీల్చుకుపోయిందట. నీళ్ళు కూడా తాగకపోవడంతో ఆమె గొంతు ఎండిపోయి నోటి నుంచి నురగ వచ్చేస్తోందట. అయినా కూడా ఆమె వింత శబ్ధాలు చేస్తూనే ఉందట. పద్మజ చేస్తున్న కేకలతో తోటి ఖైదీలు వణికిపోతున్నారట. వారికి కూడా నిద్ర లేకుండా చేస్తోందట పద్మజ.
 
ఇక తండ్రి పురుషోత్తం అయితే ఒక మూలన సైలెంట్‌గా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడట. అంతేకాకుండా ఉన్నట్లుండి గట్టిగా ఏడుస్తున్నాడట. దీంతో భయాందోళనలతో ఉంటున్నారు తోటి ఖైదీలు. వారిద్దరి మానసిక స్థితి సరిగ్గా లేదని.. వైజాగ్‌కు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ కోరుతున్నా సరే అనుమతి మాత్రం రావడం లేదట. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments