Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మదనపల్లె కేసు.. పద్మజ అలా చెప్పేదట.. కరోనా కూడా అందులో భాగమేనని?

మదనపల్లె కేసు.. పద్మజ అలా చెప్పేదట.. కరోనా కూడా అందులో భాగమేనని?
, శనివారం, 30 జనవరి 2021 (10:44 IST)
మదనపల్లెలో హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికగా భావించుకున్న.. తన భార్య పద్మజ పెద్ద కుమార్తె అలేఖ్యను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసిందని భర్త పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పారు.
 
'కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తికాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి' అని అలేఖ్య తనకు చెప్పినట్లు పురుషోత్తం తెలిపారు. 'కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయి' అని వైద్యులకు చెప్పారు.
 
పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిసింది. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని, వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని మానసిక వైద్యులు భావిస్తున్నారు. ఆలేఖ్య ఫేస్‌బుక్‌ ఖాతా శుక్రవారం బ్లాక్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా మాత్రం క్రియాశీలకంగానే ఉంది.
 
చెల్లి చచ్చిపోతానంటే అక్క ఆమెను ప్రోత్సహించింది. అలాంటి ఆలోచన సరికాదని మొదట్లో వారికి సర్దిచెప్పిన తల్లిదండ్రులూ చివరికి అదే మూఢవిశ్వాస మైకంలోకి వెళ్లిపోయారు. చివరకు ఘోరమైన హత్యలకు పాల్పడ్డారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 1315 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు