Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

నేను అలేఖ్యను కాదు, మోహినిని.. మదనపల్లె హత్యల ఎపిసోడ్

Advertiesment
Alekhya
, శుక్రవారం, 29 జనవరి 2021 (13:47 IST)
మదనపల్లె జంట హత్యల కేసు కాస్త థ్రిల్లర్‌గా మారుతోంది. మొదట్లో తల్లిదండ్రులే కూతుర్లను చంపేశారనుకుంటే చివరకు పెద్ద కుమార్తే ఇందుకు ప్రధాన సూత్రదారిగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రిమాండ్ రిపోర్టులో కూడా ఈ నిజాలు బయటకు వచ్చాయి. 
 
అసలు పురుషోత్తంనాయుడు, పద్మజలు కుమార్తెలు ఎందుకు చంపుకున్నారా అని అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో ఆసక్తికరమైన నిజాలు బయటకు వచ్చాయి. తల్లి పద్మజ పెద్ద కుమార్తె అలేఖ్యను చంపేస్తే.. అలేఖ్య చెల్లెలు సాయి దివ్యను చంపేసింది.
 
అసలు ఈ మొత్తానికి కారణం పెద్ద కుమార్త అలేఖ్య. ప్రిన్సిపల్‌గా ఉండి.. ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబమది. తల్లి కూడా ప్రిన్సిపల్. అయితే మూఢ భక్తితో చివరకు పిచ్చి పీక్స్‌కు చేరింది. తన పిచ్చిని పెద్ద కుమార్తెకు అంటించింది. అది కాస్త చివరకు అలేఖ్యను మరింత ముందుకు తీసుకెళ్ళింది.
 
చెల్లెలు చేతబడి చేసిన ముగ్గును తొక్కితే నీకేం భయం లేదు.. నీకు దెయ్యం పట్టింది. నేను వదిలించేస్తానంటూ ఆమెను దారుణంగా డంబెల్‌తో కొట్టి చంపేసింది. ఆ తరువాత తాను చెల్లెలిని తీసుకొస్తానని చెప్పి తనను చంపేయమని తల్లి పద్మజను కోరింది. దీంతో ఆమె డంబెల్‌తో అలేఖ్యను చంపేసింది.
 
అంతకుముందు తన పేరు అలేఖ్య కాదు.. మోహినీ అని పేరు మార్చేసుకుందట. తన గదిలో మొత్తం హర్రర్ పుస్తకాలే ఉన్నాయట. అంతేకాదు తన పెంపుడు కుక్కను తానే చంపి మళ్ళీ బతికించినట్లు కూడా అలేఖ్య చెప్పిందట. దీంతో తల్లిదండ్రులు అలేఖ్యను చంపేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం రోజుకొక మలుపు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పుడు వార్తను ట్వీట్ చేసిన రాజ్‌దీప్ సర్దేశాయ్... 2 వారాల సస్పెన్షన్ వేటు