మదనపల్లె జంట హత్యల కేసు గురించి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో దోషులు తల్లిదండ్రులు. బిడ్డల్ని చంపేశామన్న పశ్చాత్తాపం ఏ మాత్రం వారిలో కనిపించలేదు. ముఖ్యంగా నిన్న సాయంత్రం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు వీరిద్దరినీ.
14 రోజుల పాటు రిమాండ్‌కు పంపించారు. అయితే జైలులో ఏ మాత్రం బాధపడకుండా పద్మజ హాయిగా మెడిటేషన్ చేసుకుని కూర్చుని ఉందట. కేవలం గంట మాత్రమే ఆమె నిద్రపోయిందట. మిగతా సమయం మొత్తం నేను శివుడ్ని అంటూ చెప్పుకుందట.
నేను శివుడ్ని, నన్ను కరోనా ఏమీ చేయలేదు నాకు పరీక్ష చేస్తారా.. నేను ధ్యానంలో ఉన్నాను. అన్ని రోగాలు తొలగిపోతాయి. ఇలా ఏవేవో చెప్పుకుంటూ గట్టిగా అరుస్తూ సబ్ జైలులో కూర్చుందట పద్మజ. దీంతో జైలు సూపరింటెండెంట్ రామక్రిష్ణ నాయక్ ఉదయాన్నేభార్యాభర్తలిద్దరినీ మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్ళారట.
ఆసుపత్రిలో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారట. దీంతో మెజిస్ట్రేట్ ఆదేశాలతో తిరుపతి రుయాకు నిందితులిద్దరినీ తీసుకువస్తున్నారు. వారిద్దరికీ రుయాలో ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత తిరిగి మదనపల్లె ప్రభుత్వ సబ్ జైలుకు తరలిస్తారు.