Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ శివయ్యే

Advertiesment
బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ శివయ్యే
, సోమవారం, 18 జనవరి 2021 (23:00 IST)
పూర్వజన్మలో ఋణము వుంటేనే తప్ప ఏవీ  కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణాన్ని బట్టి  భార్య కాని, భర్త కాని వివాహబంధంతో  ఏకమవుతారు. అలాగే పిల్లలు పుట్టాలన్న వారి ఋణము మనకు వుండాలి. ఇక ఇంట తిరిగే పశువులు, ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మనకు దక్కవు.
 
అంతెందుకు ఋణము వుంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది కూడా ఋణానుబంధమే. ఋణమనేది లేకుంటే ఎవరినీ కలలో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు.
 
ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి. ఋణం కేవలం ధనం మాత్రమే కాదు. బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎంత యత్నించినా కూడా రుణం లేకపోతే ఏది జరగదు ఏ బంధం నిలువదు.
 
ఏ బంధమైనా వదిలేసినా  ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి.  ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి  దూరంగా ఉన్నా మన వాళ్లేగా. ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా. వాళ్ల సంతోషం కోరుకోండి. బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ శివయ్యే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం గవ్వలను లక్ష్మీదేవి ముందు వుంచి పూజిస్తే..?