Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయిదివ్య, అలేఖ్యల మధ్య మరొక వ్యక్తి, ఎవరు?

Advertiesment
సాయిదివ్య, అలేఖ్యల మధ్య మరొక వ్యక్తి, ఎవరు?
, శుక్రవారం, 29 జనవరి 2021 (18:13 IST)
థ్రిల్లర్‌ను తలపించే ఎపిసోడ్ మదనపల్లె డబుల్ మర్డర్ కేసు. ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంటే పోలీసులు మాత్రం కేసును మరింత లోతుగా విచారించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు తల్లిదండ్రులే హత్యకు ప్రధాన కారణంగా చెప్పుకుంటూ ఉంటే.. వారే కాకుండా మరొక వ్యక్తి ఈ హత్యలో భాగస్వామ్యుడయ్యాడని తెలుస్తోంది.
 
సరిగ్గా నాలుగు రోజుల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్కాచెల్లెల్లె హత్య జరిగింది. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ హత్యకు సంబంధించి మొదట్లో తల్లిదండ్రులే కారణం.. మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను చంపుకున్నారని అందరూ అనుకున్నారు. 
 
కానీ ఇందులో కొత్త ట్విస్ట్.. సాయి దివ్యను అలేఖ్య చంపిన తరువాత అలేఖ్య చనిపోక ముందు వీరి మధ్యన ఒక వ్యక్తి ఉన్నాడట. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరన్నది పోలీసులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న సి.సి. టివిని పూర్తిగా ఆపేసిన తరువాత ఇంట్లో పూజలు చేశారట పురుషోత్తం, పద్మజ, అలేఖ్య. 
 
కానీ వీరికి మధ్యలో ఒక వ్యక్తి కూర్చుని పూజ చేశారట. ఆ తాంత్రికుడు ఎవరన్నది పోలీసులు కనిపెట్టే పనిలో పడ్డారు. పురుషోత్తం నాయుడుకు ఇంటికి పక్కనే ఉన్న సిసిటివి ఫుటేజ్‌లు మొత్తాన్ని తీస్తున్నారు. ఆ సి.సి. ఫుటేజ్‌లో నిక్షిత్తమైన సమాచారం బట్టి నిందితుడిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ కుటుంబాన్ని ఇంతలా ప్రేరేపించిన వ్యక్తి ఎవరన్నది పోలీసులు కూడా తెలుసుకునేందుకు మరింత ఆసక్తిని చూపిస్తున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ పాలిటిక్స్‌లో మెగా మార్పు సాధ్యమా! ..... మెగాస్టార్ నోరు విప్పేనా!