Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెపోలియన్‌ రివ్యూ రిపోర్ట్: నా నీడపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లెంట్..

ఈ కథ మైండ్‌గేమ్‌తో సాగేది. సామాన్యుడికి కాస్త కన్‌ఫ్యూజ్‌గానూ వుంటుంది. కానీ ఇలాంటి కాన్సెప్ట్‌లే చూడ్డానికి ఇంట్రెస్ట్‌గా వుంటాయి. గతంలో 'ఆనంద్‌' చిత్రానికి పనిచేసిన రవి ఈ చిత్రం తర్వాత ఆనంద్‌ రవిగా

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (10:39 IST)
నటీనటులు: 
ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి, గురురాజ్‌, భాను, రియాజ్‌, అల్లు రమేష్‌, డిఎంకె తదితరులు
సాంకేతికవర్గం: 
కెమెరా: మర్గల్‌ డేవిడ్‌, 
ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌,
సంగీతం: సిద్దార్థ్‌ సదాసివుని,
పాటలు: బాలాజీ, 
నిర్మాత: బోగేంద్ర గుప్తా, 
దర్శకత్వం: ఆనంద్‌ రవి.
 
ఇటీవల తెలుగులో కాన్సెప్ట్‌ చిత్రాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు కొత్త ఆలోచనలతో కథలు తయారుచేసుకుని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అలాంటి కోవలో 'నా నీడపోయిందంటూ పోలీసు స్టేషన్‌లో' ఫిర్యాదు చేస్తూ విడుదలైన 'నెపోలియన్‌' ట్రైలర్‌ వినూత్నంగా వుందనే టాక్‌ వచ్చింది. మరి దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ సినిమా కథలోకి వెళదాం. 
 
కథ:
సిటీలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు నెపోలియన్‌ (ఆనంద్‌ రవి) వచ్చి తన నీడ ఈరోజు మార్నింగ్‌ నుంచి కన్పించడంలేదని ఫిర్యాదు చేస్తాడు. కానిస్టేబుల్స్‌, సి.ఐ. రవివర్మ ఇదేదో యర్రగడ్డ ఆసుపత్రి కేసు అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ నా నీడ కన్పించేవరకు కదిలేది లేదని అక్కడే తిష్టవేస్తాడు. దీంతో కమీషనర్‌ కేదార్‌శంకర్‌తో సంప్రదించి ఎండలో నిలబెట్టినా అతని నీడ కన్పించదు. ఇదేదో ఇంట్రెస్ట్‌గా వుందనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి నిద్రలోంచి బయటకు వచ్చిన నెపోలియన్‌.. తనకు దేవుడు కన్పించాడనీ.. ఇటీవల శ్రీనగర్‌కాలనీలో జరిగిన యాక్సిడెంట్‌ కేసులో మరణించిన తిరుపతిది హత్యని చెబుతాడు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న సి.ఐ. రవివర్మ క్లోజ్‌ అయిన ఆ కేసును టేకప్‌ చేస్తాడు.
 
అనంతరం అది హత్య అని రూఢీ అవుతుంది. కేసును లోతుగా శోధిస్తుండగా యాక్సిడెంట్‌లో చనిపోయిన తిరుపతి ఆత్మ నెపోలియన్‌లో వుందనీ, తిరుపతి భార్య కూడా మిస్సింగ్‌ కావడంతో ఆమెకోసం, బిడ్డకోసం ఇలా నెపోలియన్‌ వెతుకుతున్నాడని పోలీసులు గ్రహిస్తారు. దీంతో నెపోలియన్‌ వారికి పెద్ద పజిల్‌గా మారతాడు. ఆ తర్వాత నెపోలియన్‌ చెప్పిన ఓ విషయంతో పోలీసులు మరింత కూపీలాగగా.. అసలు హంతకుడు నెపోలియన్‌ అని తెలుస్తుంది. తనే హత్యచేసి ఇంత డ్రామా ఎందుకాడాడు? అసలు అతనే హత్యచేశాడా? ఇంకెవరైనా వున్నారా? అన్నది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఈ కథ మైండ్‌గేమ్‌తో సాగేది. సామాన్యుడికి కాస్త కన్‌ఫ్యూజ్‌గానూ వుంటుంది. కానీ ఇలాంటి కాన్సెప్ట్‌లే చూడ్డానికి ఇంట్రెస్ట్‌గా వుంటాయి. గతంలో 'ఆనంద్‌' చిత్రానికి పనిచేసిన రవి ఈ చిత్రం తర్వాత ఆనంద్‌ రవిగా మారిపోయాడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. టైటిల్‌ రోల్‌ను తనే ప్లే చేశాడు. అతని భార్య స్రవంతిగా కోమలి నటించింది. తిను డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తూ నటిగా మారడం విశేషం. 
 
ఇక మిగిలిన వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నీడపోయిందనే.. దగ్గరనుంచి మొదటిభాగం చాలా ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. ఈ భాగంలోనే వచ్చే టైటిల్‌ సాంగ్‌ కూడా అంతే ఇంట్రెస్ట్‌గా వుంటుంది. ఇక, ద్వితీయార్థంలో వచ్చేసరికి సస్పెన్స్‌ ముడి విప్పాలి కాబట్టి ఆ దిశగా కథ సాగుతుంది. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి దగ్గర నమ్మకస్తురాలిగా పనిచేసిన కోమలి, తన భర్త నెపోలియన్‌తోనూ కోటీశ్వరుడికి నమ్మకస్తుడైన మరో వ్యక్తితో కలిసి ఆడిన గేమే ఈ చిత్ర కథ. ఇది చెప్పే విధానం ఆసక్తిగా వున్నా.. సామాన్యుడికి వెంటనే అర్థంకాదు. ఒకరకమైన మైండ్‌గేమ్‌తో సాగిన సన్నివేశాలు చాలా చోట్ల ఆసక్తికనబరుస్తాయి. 
 
నటనాపరంగా ఆనంద్‌రవి దర్శకుడు కావడంతో తన పాత్రను సహజంగానే చేసేశాడు. బరువైన సి.ఐ. పాత్రను రవివర్మ చేసినా మెప్పించగలిగాడు. ఇక ఇతర పాత్రలు ఇంట్రెస్ట్‌గా వున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డేవిడ్‌ ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ సీన్స్‌ కన్‌ఫ్యూజ్‌ చేయడంలో తన పనితనాన్ని చూపాడు. ఇలాంటి సస్పెన్స్‌ కథలు సీరియస్‌గా సాగుతూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేస్తాయి. 
 
పరిమిత లొకేషన్లలో రూపొందిన ఈ చిత్రంలో నిర్మాణపు విలువలు తగినమేరకే వున్నాయి. ఒక ప్రణాళికగా చిత్రాన్ని తెరకెక్కించినా ఒకటి రెండు చోట్ల లాజిక్కుల మిస్సయ్యాడు. తనే చంపేసి తన నీడే కన్పించలేదని ఎందుకు వచ్చాడు? అలా వస్తే పోలీసులకు దొరికిపోడా? అన్న కోణాన్ని ఇంకాస్త క్లారిటీగా చూపిస్తే కథ మరింత రక్తికట్టేది. దాన్ని మరిపించడానికి రకరకాల సన్నివేశాలన్ని ఆసక్తికరంగా చూపించడంలో మర్చిపోయేలా చేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
దర్శకుడిలో రచయిత వుండడంతో మాటలు కూడా క్యాజువల్‌గా వుండేట్లు కేర్‌ తీసుకున్నాడు. నీడకన్పించకుండా వుండటమనే దాన్ని సీజీవర్క్‌తో తెలీకుండా చేయడం విశేషం.  పరిమిత నటీనటులతో సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో సఫలం అయ్యారనే చెప్పాలి. ఇటువంటి కథలు కొన్ని వర్గాలవారికి బాగా నచ్చుతాయి.
 
రేటింగ్‌: 5కు 2.75

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments