Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐ ఫోన్‌తో తీసిన 'లవర్స్ క్లబ్' సినిమా... రివ్యూ

లవర్స్‌ క్లబ్‌ నటీనటులు : అనీష్‌ చంద్ర, పావని, పూర్ణి తదితరులు. టెక్నికల్‌ టీమ్‌: సంగీతం : జరవి నిడమర్తి, నిర్మాత: భరత్‌ అవ్వారి, దర్శకత్వం : ధవ శంకర్‌. విడుదల తేదీ : శుక్రవారం, నవంబర్‌ 17, 2017. సిన

ఐ ఫోన్‌తో తీసిన 'లవర్స్ క్లబ్' సినిమా... రివ్యూ
, శుక్రవారం, 17 నవంబరు 2017 (16:59 IST)
లవర్స్‌ క్లబ్‌ నటీనటులు : అనీష్‌ చంద్ర, పావని, పూర్ణి తదితరులు. టెక్నికల్‌ టీమ్‌: సంగీతం : జరవి నిడమర్తి, నిర్మాత: భరత్‌ అవ్వారి, దర్శకత్వం : ధవ శంకర్‌.
 
విడుదల తేదీ : శుక్రవారం, నవంబర్‌ 17, 2017.
సినిమా కెమెరా విధానంలో కొత్త ఒరవడి సృష్టించిన సినిమా 'ముంబై ఎక్స్‌ప్రెస్‌'. కమల్‌ హాసన్‌ రెడ్‌ కెమెరాతో వినూత్న ప్రయోగం చేశాడు. అయితే ఐ ఫోన్‌తో సినిమా తీయడం విశేషం. అందులో తెలుగులో మొదటిసారి. అది 'లవర్స్‌ క్లబ్‌'తో సాధ్యపడింది. దర్శకుడు ధవ శంకర్‌ దీన్ని ఎలా తెరకెక్కించాడు. అసలు లవర్స్‌ క్లబ్‌ అంటే ఏమిటో చూద్దాం.
 
కథ:
ప్రేమికుల కోసం 'లవర్స్‌ క్లబ్‌'ను ఏర్పాటు చేసి రిషి భరద్వాజ్‌ వారిని ఒక్కటిగా చేస్తాడు. అందులో కులమతాలకు తావులేదు. ఆ క్రమంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుమార్తె వివాహం చేస్తాడు. అది పెద్ద రాద్దాంతాకి తావిస్తుంది. తన కుమార్తెకు తమ కులం కానివాడితో పెళ్లి చేశాడనే కోపంతో రిషి మీద పగ పెంచుకుంటాడు వ్యాపారి. ఆ పగ ఎలా తీర్చుకున్నాడు? అనుకోకుండా రాజు ఈ కథలోకి ఎందుకు వచ్చాడు? తర్వాత ఏమిటనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ప్రేమించిన జంటను కలపడం హీరోయిజం. ఈ కాన్సెప్ట్‌ రామ్‌, అల్లు అర్జున్‌తో సహా చేసినవారే. వాటిని ఆసక్తికరంగా తెచ్చే విధానం వుంటేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆ దిశగా దర్శకుడు చేసినా కొంత పాత తరహాలో సాగడం చిన్నపాటి లోపం. కొత్తవారైనా ప్రేమికులకు అండగా నిలబడే రిషి పాత్రలో అనీష్‌ చంద్ర బాగా నటించాడు. దర్శకుడు  పాత్రను మలిచిన విధానం మెప్పించింది. రిషి లవర్‌గా నటించిన యువతి కూడా బాగా నటించిది. ప్రేమికులుగా నటించిన రాజు, రాణి పాత్రల్లో నటించిన ఇద్దరు బాగా చేశారు. సినిమాలో కీలక సీన్స్‌లో కనిపించిన వారు ప్రేక్షకులను మెప్పిస్తారు. ముఖ్యంగా రాణి పాత్ర చేసిన అమ్మాయి తెలంగాణా భాషలో మెప్పించింది. యాక్షన్‌ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. 
 
ఇందులో ప్రధానమైంది ఐ ఫోన్‌తో చిత్రీకరించడం. రెండు గంటల సినిమాను ఐ ఫోన్‌ సహాయంతో ఎలా కష్టపడి చిత్రీకరించారు అన్నది సినిమా పూర్తయ్యాక ముగింపు టైటిల్స్‌ సమయంలో మేకింగ్‌ విడియోలో చూపించడం జరిగింది. చిత్రీకరణ అయ్యాక ఐ ఫోన్‌లో చిత్రీకరించామని చెప్పి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. ఇది ప్రమోషన్‌లో భాగం అనుకున్నా ఇంకా శ్రద్ధ పెడితే బాగుండేది. అయితే సగటు ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం కూడా చూపించితే మరింత ఆకట్టుకునేది. ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా సాగడం కాస్త నిరాశ కలిగిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే పాటకు సరైన వివరణ ఇస్తే మరింత బాగుండేది. సమాజంలో స్త్రీకి భద్రత లేదని చూపించే సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణ. దీన్ని మరింతగా తీస్తే మరోరకంగా వుండేది.
 
దర్శకుడు ధ్రువ శంకర్‌ ఐ ఫోన్‌తో సినిమా ఆలోచన మెచ్చుకోదగింది. కానీ చిత్ర కథ, కథనంలో కొత్తదనం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. కెమెరామెన్‌ తన పనితనంతో మెప్పించాడు. పాటలు పెద్దగా లేనప్పటికీ బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. తక్కువ బడ్జెట్‌లో సినిమాను నిర్మించారు. ఎక్కువ ఖర్చు లేకుండా తెలంగాణా పరిసర ప్రాంతాల్లో సినిమా తీయడం జరిగింది. ఇటువంటి సినిమాను ఐ ఫోన్స్‌తో ఎలా తీశారనేవారికి ఇంట్రెస్ట్‌గా వుంటుంది.
 
రేటింగ్ ‌: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి కూతురిని చంపేస్తారా..!