Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చురీకి వచ్చిన హీరోయిన్ శవంతో ఆ ముగ్గురూ ఏం చేశారు? రివ్యూ

'దేవీశ్రీప్రసాద్‌' నటీనటులు: ధనరాజ్‌, మనోజ్‌ నందన్‌, పోసాని కృష్ణమురళి, పూజా రామచంద్రన్‌, భూపాల్‌ రాజు, నల్లవేణు తదితరులు; సంగీతం: సయ్యద్‌ కమ్రాన్‌, నిర్మాతలు: ఆక్రోష్‌, డి. వెంకటేష్‌, దర్శకత్వం: శ్రీ

మార్చురీకి వచ్చిన హీరోయిన్ శవంతో ఆ ముగ్గురూ ఏం చేశారు? రివ్యూ
, గురువారం, 23 నవంబరు 2017 (21:36 IST)
'దేవీశ్రీప్రసాద్‌' నటీనటులు: ధనరాజ్‌, మనోజ్‌ నందన్‌, పోసాని కృష్ణమురళి, పూజా రామచంద్రన్‌, భూపాల్‌ రాజు, నల్లవేణు తదితరులు; సంగీతం: సయ్యద్‌ కమ్రాన్‌, నిర్మాతలు: ఆక్రోష్‌, డి. వెంకటేష్‌, దర్శకత్వం: శ్రీకిషోర్‌.
 
రొటీన్‌ ప్రేమకథా చిత్రాల స్థాయిలోనే ఈమధ్య సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో కూడిన చిత్రాలు వస్తున్నాయి. ఆ కోవలోనే 'దేవీశ్రీప్రసాద్‌' అనే చిత్రం విడుదవుతుంది. ఈ చిత్ర ప్రివ్యూను ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ట్రైలర్‌లో ఏదో జరుగుతుందనే ఆసక్తిని కల్గించిన ఈ చిత్రంలో ఏముందో చూద్దాం.
 
కథ : శ్రీ (ధనరాజ్‌), దేవీ (భూపాల్‌రాజు), ప్రసాద్‌ (మనోజ్‌ నందన్‌) స్నేహితులు. శ్రీ.. మార్చూరి బాయ్‌. దేవీ ఆటోడ్రైవర్‌, ప్రసాద్‌ టీ బంకును నడిపేవాడు. సమయం చిక్కినప్పుడుల్లా బీరు తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కాగా, హీరోయిన్‌గా నటించే పల్లవి(పూజా)కి వీరు వీరాభిమానులు. ఒక్కసారైనా కలవాలని ముగ్గురు ప్రయత్నించి ఫెయిలవుతారు. అనుకోకుండా కారు ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడి చనిపోతుంది. ఆసుపత్రిలోని మార్చురీలో శవాన్ని భద్రపరుస్తారు. 
 
ఈ విషయం తన స్నేహితులకు శ్రీ చెప్పడంతో వారు.. ఈమెను చాలా దగ్గరగా చూడాలనే ఆశతో మార్చురీకి వస్తారు. ఆ తర్వాత శ్రీ, దేవీలో వింత కోరికలు కలుగుతాయి. దాన్ని ప్రసాద్‌ వారిస్తాడు. ఆ గొడవలో హఠాత్తుగా పల్లవికి స్పృహ వస్తుంది. దీంతో వారు భయపడి ఆమెను నిజంగానే చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో ఆమె ఎలా తప్పించుకుంది? అసలు ఈమెను చంపాలని ఎవరు చూశారనేది? మిగిలిన కథ.
 
విశ్లేషణ :
చిత్రమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. హీరోయిన్లను దగ్గరగా చూడాలనుకునే వారిలో ఆమెను ఒక్కసారైనా టచ్‌ చేయాలనిపిస్తుంది. అలాంటి ఆమె స్పృహ కోల్పోతే ఆమెను ఎలా దక్కించుకోవాలనే పాయింట్‌తో కథంతా నడుస్తుంది.  హాలీవుడ్‌ తరహా కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. చెప్పడానికి చూడ్డానికి వింతగా వున్నా.. ఆమెను ఈ ముగ్గురు ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పించి కథను ఆసక్తి కల్గించారు. వారు ఆడిన డ్రామాను పోలీసు ఆఫీసర్‌ పోసాని ఎలా బయటపెట్టాడన్నది ఆసక్తిగా వుంటుంది. ఇందులో నల్లవేణు పాత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. మార్చురీ బాయ్‌గా ధనరాజ్‌ జీవించాడు. క్షణికావేశంతో రగిలిపోయే పాత్రలో భూపాల్‌రాజు నప్పాడు. అమాయకత్వం, భయంతో కూడిన పాత్రను మనోజ్‌ నందం చేశాడు.
 
ఇటువంటి పాయింట్‌కు నేపథ్య సంగీతం కీలకం. ప్రతి షాట్‌లోనూ సయ్యద్‌ కమ్రాన్‌ చూపించాడు. ఎక్కువగా రాత్రిపూట తీయడంతో కెమెరా పనితనం కూడా కన్పిస్తుంది. హీరోయిన్‌కు మినహా ఎవ్వరికీ పెద్దగా మేకప్‌ లేకుండా సహజంగా పాత్రలు తీర్చిదిద్దాడు దర్శకుడు. చిన్న పాయింట్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నంలో తను సఫలం అయ్యాడు.

ఇటువంటి కాన్సెప్ట్‌ చాలా కొత్తగా వుంది. మందు కొడితే మనిషిలోని మరో మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడనేందుకు ఈ చిత్రంలోని పాత్రలు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే శవాన్ని ఏదో చేసినట్లుగా చూపించడం అంత బాగోలేదు. దాన్ని మరింతగా పోలీసు ఆఫీసర్‌ పోసాని వివరించకుండా వుండాల్సింది. ఇది మినహా అంతా థ్రిల్‌ కల్గిస్తుంది. సంభాషణలు కూడా క్యాజువల్‌గా వున్నాయి. పూర్తి మాస్‌ ప్రేక్షకుల్ని అలరించే కథాంశమిది. వల్గారిటీ పెద్దగా లేకపోయినా ఏదో వుందని క్రియేట్‌ చేసిన దర్శకుడు, దీన్ని నమ్మి తీసిన నిర్మాతల్ని అభినందించాల్సిందే. 
 
రేటింగ్‌ : 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో నమిత వివాహ లైట్ మ్యూజిక్ ఈవెంట్... ఎలాగుందో తెలుసా?