Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది స్క్రిప్ట్ కాదు.. నిజంగానే ఏడ్చాను.. బిగ్‌బాస్‌ ద్వారా అది నేర్చుకున్నా: మధుప్రియ

బిగ్ బాస్ అనుభవాలను.. ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ మధుప్రియ ఓ ఇంర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ద్వారా ఎక్కడున్నా బతకగలననే విషయాన్ని నేర్చుకున్నానని చెప్పారు. ఎంతో టెక్నాలజీ ఉన్న ప్రపంచానికి దూ

Advertiesment
అది స్క్రిప్ట్ కాదు.. నిజంగానే ఏడ్చాను.. బిగ్‌బాస్‌ ద్వారా అది నేర్చుకున్నా: మధుప్రియ
, గురువారం, 3 ఆగస్టు 2017 (09:46 IST)
బిగ్ బాస్ అనుభవాలను.. ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ మధుప్రియ ఓ ఇంర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ద్వారా ఎక్కడున్నా బతకగలననే విషయాన్ని నేర్చుకున్నానని చెప్పారు. ఎంతో టెక్నాలజీ ఉన్న ప్రపంచానికి దూరంగా ఉన్నాము. సెల్ ఫోన్ లేకుండా ఎలా ఉండగలగడమని ‘బిగ్ బాస్’ కు వెళ్లే ముందు అనుకున్నాను. ఇప్పుడు అలవాటైపోయిందని మధుప్రియ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ టీమ్‌లో 14 మంది ఉండేవారు. హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ షోకు వచ్చినప్పుడు తమకు చాలా ఆనందంగా ఉండేదని మధుప్రియ వెల్లడించింది. 

బిగ్ బాస్ విన్నర్‌గా నటులు ధన్ రాజ్ లేదా ఆదర్శ్ ఎంపికవుతారని తాను అనుకుంటున్నానని సింగర్ మధుప్రియ అభిప్రాయపడింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘బిగ్ బాస్’ ఫైనల్స్‌కు వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని మధుప్రియ తెలిపింది. 
 
‘బిగ్ బాస్’ ఏదీ ప్రీప్లాన్డ్‌గా ఉండదు. ప్రతిదీ సర్ ప్రైజే. ఈ షోలో ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అలా ఉంటేనే కరెక్టుగా ఉన్నట్టు. ఒకవేళ, ఆ విధంగా కాకుండా మనం ఎవరితోనైనా గొడవపడితే, మన మీద కన్ఫెషన్ రూమ్‌లో ఫిర్యాదు చేస్తారు. ‘బిగ్ బాస్’ నుంచి నేను ఎలిమినేట్ అయ్యాక చాలామంది నాకు ఫోన్లు చేసి.. ‘అది స్క్రిప్టా?’ ‘మీరు నిజంగా ఏడ్చారా?’ అని అడిగేవారు. ఇదంతా రియల్, స్క్రిప్ట్ కాదని మధుప్రియ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటన నాకు ఫ్యాషన్‌. అందుకే నటిస్తున్నా.. అంటున్న బాపు గారి బొమ్మ