Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజా రామచంద్రన్ అలా నటించేందుకు ఒప్పుకుంది...: మనోజ్‌ నందం

''సినిమా అంటే ఏదో నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు అని కాకుండా కొత్తగా చేయాలని దర్శకుడు శ్రీ కిషోర్‌ తయారు చేసుకున్న కథే 'దేవీశ్రీప్రసాద్‌' అని'' కథానాయకుడు మనోజ్‌ నందం తెలియజేస్తున్నాడు. పూజా రామచంద్రన్‌, భూపాల్‌ రాజ్‌, ధనరాజ్‌, మనోజ్‌ నందం ప్రధాన పాత్రద

Advertiesment
Actor Manoj Nandam
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (19:01 IST)
''సినిమా అంటే ఏదో నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు అని కాకుండా కొత్తగా చేయాలని దర్శకుడు శ్రీ కిషోర్‌ తయారు చేసుకున్న కథే 'దేవీశ్రీప్రసాద్‌' అని'' కథానాయకుడు మనోజ్‌ నందం తెలియజేస్తున్నాడు. పూజా రామచంద్రన్‌, భూపాల్‌ రాజ్‌, ధనరాజ్‌, మనోజ్‌ నందం ప్రధాన పాత్రదారులు. శ్రీకిషోర్‌ దర్శకుడు. డి.వెంకటేష్‌, ఆర్‌వి. రాజు, ఆక్రోష్‌ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్‌ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మనోజ్‌ నందం విలేకరులతో మాట్లాడారు.
 
గత ఏడాది నవంబర్‌ నెలలో ఈ సినిమా ప్రారంభించాం. 25 రోజుల్లో పూర్తయింది. నిర్మాతలు కొత్తవారు కావడం, చిన్నచిన్న సమస్యల వల్ల విడుదల ఆలస్యమయింది. ఆ సమయంలో డి.వి. క్రియేషన్స్‌ వెంకటేష్‌ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆ తర్వాత కమర్షియల్‌గా బాగా ఆడుతుందనే నమ్మి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ చిత్ర కథను ముందుగా నటుడు ధనరాజ్‌ నాకు చెప్పాడు. దర్శకుడు శ్రీకిషోర్‌ హాంగ్‌కాంగ్‌లో డాన్స్‌ కొరియోగ్రాఫర్‌. 
 
తను ఫోన్‌లోనే నాకు కథ వినిపించారు. కథ ప్రకారం మూడు పాత్రలు కావాలి. నేను, ధనరాజ్‌ ఒకే అనుకున్నాం. మూడో పాత్ర కోసం పలువురిని పరిశీలించాక ఆఖరికి భూపాల్‌ను ఎంపిక చేశాం. ఇందులో మూడు పాత్రలు భిన్నమైనవి. భూపాల్‌ పాత్ర నెగెటివ్‌గా, ధనరాజ్‌ పాత్ర గోడమీద పిల్లిలా, ప్రసాద్‌ అనే నా పాత్ర పాజిటివ్‌గా వుంటుంది. ఈ మూడు పాత్రల చుట్టూ జరిగిన అసాధారణ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయనేది కథ. 
webdunia
 
ఇది ఈమధ్యే ముంబైలో కూడా జరిగిన ఓ సంఘటన. సినిమా చూశాక.. మన దగ్గర కూడా ఇలా జరిగిందనిపిస్తుంది. ఇక లీల పాత్ర కోసం పదిహేనుమంది అమ్మాయిలను సంప్రదించాం. చాలామంది ఈ సినిమాను ఎలా తీస్తారో అని వారికి సందేహం కలిగి విరమించుకున్నారు. ఆ సమయంలో పూజా రామచంద్రన్‌కు కథను వినిపించడం ఆమె అంగీకరించడం జరిగిపోయాయి. కాగా, ఈ సినిమా దర్శకుడు ప్రతిభకు, కష్టానికి నిదర్శనం. రొటీన్‌ సినిమాలా నాలుగు ఫైట్లు, పాటలు వుండవు. 
 
కొత్తగా చేయాలని చేసిన ప్రయత్నమిది. సినిమాటోగ్రాఫర్‌ ఫణి మంచి విజువల్స్‌ అందించారు. కమ్రాన్‌ బాణీలతో ఆకట్టుకున్నాడు. సినిమా రష్‌ చూశాక ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందనే నమ్మకముందని చెప్పారు. కొత్త చిత్రాల గురించి చెబుతూ... 'మనసైనోడు' చిత్రం నవంబర్‌లోనే విడుదల కాబోతుంది. నారా రోహిత్‌ నటిస్తున్న 'వీరభోగ వసంతరాయులు' చిత్రంలో ప్రముఖ పాత్ర చేస్తున్నాను. మహేష్‌ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని' చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదే అమ్మాయి అయితే 'ఐ మిస్‌ యు' అనిపిస్తుంది... హీరో రామ్‌ ఇంటర్వ్యూ