Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే అమ్మాయి అయితే 'ఐ మిస్‌ యు' అనిపిస్తుంది... హీరో రామ్‌ ఇంటర్వ్యూ

''కథ దర్శకుడు చెప్పినప్పుడే దానికి తుదిమెరుగులు దిద్దే క్రమంలో కొన్ని విషయాలను పంచుకుంటాం. ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు చెబుతుంటే, నా పాత్ర అభిరామ్‌కు తగినట్లుగా నా జీవితంలో తెలిసిన ఫ్రెండ్స్‌ గురించి షేర్‌ చేసుకుంటూ వుంటాను. ఇక తెరపై ఎక్కాక అ

Advertiesment
unnadi okate zindagi hero ram interview
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:56 IST)
''కథ దర్శకుడు చెప్పినప్పుడే దానికి తుదిమెరుగులు దిద్దే క్రమంలో కొన్ని విషయాలను పంచుకుంటాం. ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు చెబుతుంటే, నా పాత్ర అభిరామ్‌కు తగినట్లుగా నా జీవితంలో తెలిసిన ఫ్రెండ్స్‌ గురించి షేర్‌ చేసుకుంటూ వుంటాను. ఇక తెరపై ఎక్కాక అందులో ఎటువంటి ప్రమేయం వుండదు. అంతా దర్శకుడు అనుకున్నట్లే సాగుతుందని'' కథానాయకుడు రామ్‌ స్పష్టం చేస్తున్నారు. 
 
'నేను శైలజ' దర్శకుడు కిశోర్‌ తిరుమలతో ఆయన నటిస్తున్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. 'స్రవంతి' రవి కిశోర్‌ నిర్మాత. ఈ నెల 27న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రామ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
కథను ఎలా ఎంపిక చేసుకున్నారు?
'హైపర్‌' తర్వాత కథల కోసం వెతికాం. కొన్ని నచ్చలేదు. ఆ క్రమంలో ఈ దర్శకుడు ఆ కథ చెప్పగానే నచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నా.
 
చిత్రం లోని ప్రధాన పాయింట్‌ ఏమిటి?
ఇది స్నేహం అనే కాన్సెప్ట్‌ మీద తీసిన సినిమా. ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య జరిగే కథ. ఓ లవ్‌ స్టోరీ కూడా ఇందులో వుంటుంది. అభిరామ్‌ అనే పాత్ర పోషించా. బాల్యం, కాలేజీ జీవితం, ఆ తర్వాత జరిగే ప్రయాణం.. మూడు దశల్లో కథ వుంటుంది. 
 
'నేను శైలజ' కూడా ఇంచుమించు ఫ్రెండ్‌షిప్‌ కథే కదా?
'నేను శైలజ'లో హరి పాత్రకూ, ఇందులో అభిరామ్‌ పాత్రకు చాలా వ్యత్యాసం వుంటుంది. జీవితం అనేది సింపుల్‌. మనం దాన్ని కావాలనే కాంప్లికేటెడ్‌ చేసుకుంటాం అనే భావనతో వుండే పాత్ర ఇది. దాన్ని సమర్థవంతంగా పోషించా.
 
కథ మీ కోణంలో నటిస్తుందా? మరి హీరోయిన్‌ జీవితంలోనూ ఓ మంచి ఫ్రెండ్‌ వుంటారుకదా. ఆ కోణాన్ని టచ్‌ చేశారా?
అంత లోతుకు వెళ్ళలేదు. తనకూ ఫ్రెండ్‌ వుండవచ్చు. కానీ నాకూ, శ్రీవిష్ణుకు మధ్య జరిగే కథ కాబట్టి హీరోయిన్‌లో ఆ కోణాన్ని చూపించలేదు. అది కూడా చూపించాలంటే పెద్ద కథ అవుతుంది. టైటిల్‌లో చెప్పిట్లే ఒకటే జిందగీ కాదు. 'ఉన్నది చాలా జిందగీ'. అందుకే దాని కోసం సీక్వెల్‌ చేయాల్సిందే.
 
హీరోయిన్లు ఎలా నటించారు?
అనుపమ, లావణ్య ఇద్దరూ వేరియేషన్స్‌ వున్న పాత్రలు. ఎవరికివారు పోటీపడి నటించినట్లుంది. 
 
ఒకసారి వద్దనుకున్న కథ గురించి ఆలోచించేవారా?
ఒకసారి వద్దనుకంటే మరలా దాని గురించి ఆలోచించను. అనిల్‌ రావిపూడి కథ చెప్పారు. చేయాలనుకున్నా. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవుకదా.
 
బెస్ట్‌ ఫ్రెండ్‌కు లవర్‌కు తేడా ఏమిటి?
కొన్ని సందర్భాల్లో బెస్ట్‌ ఫ్రెండ్‌ అనేవాడు మన పక్కన వుంటే బాగుంటుందనిపిస్తుంది. అదే అమ్మాయి అయితే 'ఐ మిస్‌ యు' అనిపిస్తుంది.
 
దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు ఎలా అనిపించాయి?
తను నా ప్రతిసినిమాకూ మంచి బాణీలు ఇస్తాడు. కొన్ని సినిమాలు ఆడకపోయినా సంగీతపరంగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు ఆకట్టుకునే మ్యూజిక్‌ ఇచ్చాడు అని చెప్పాడు రామ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనగనగా ఒక దుర్గ ప్రి-రిలీజ్ కార్యక్రమం...