Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''పీఎస్‌వీ గరుడ వేగ'' సినిమా రివ్యూ రిపోర్ట్: రాజశేఖర్ యాక్షన్ అదుర్స్- చిరుతో భేటీ (వీడియో)

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఆఫీసర్‌ శేఖర్‌(రాజశేఖర్‌)కు తాను చేసే డ్యూటీని ఎంతో ఇష్టపడతాడు. కాబట్టి తన భార్య, పిల్లాడుతో సమయాన్ని కేటాయించలేకపోతుంటాడు. దీంతో భార్య స్వాతి (పూజా కుమార్) అతనికి దూరం అ

''పీఎస్‌వీ గరుడ వేగ'' సినిమా రివ్యూ రిపోర్ట్: రాజశేఖర్ యాక్షన్ అదుర్స్- చిరుతో భేటీ (వీడియో)
, శుక్రవారం, 3 నవంబరు 2017 (18:18 IST)
సినిమా పేరు: పీఎస్‌వీ గరుడ వేగ 
తారాగణం: డా.రాజశేఖర్‌, పూజా కుమార్‌, అలీ, నాజర్‌, అదిత్‌ అరుణ్‌, శ్రద్ధాదాస్‌, పోసాని కృష్ణమురళి, కిషోర్ తదితరులు 
దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
కథ: ప్రవీణ్‌ సత్తారు, నిరంజన్‌ రెడ్డి 
నిర్మాత: ఎం.కోటేశ్వర్‌ రాజు 
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, శ్రీచరణ్‌ పాకాల 
 
చాలా గ్యాప్ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన సినిమా గరుడ వేగ. చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాల దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రానికి దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని రాజశేఖర్ అండ్ కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రివ్యూ టాక్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళ్తే.. 
నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఆఫీసర్‌ శేఖర్‌(రాజశేఖర్‌)కు తాను చేసే డ్యూటీని ఎంతో ఇష్టపడతాడు. కాబట్టి తన భార్య, పిల్లాడుతో సమయాన్ని కేటాయించలేకపోతుంటాడు. దీంతో భార్య స్వాతి (పూజా కుమార్) అతనికి దూరం అవ్వాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓ విలువైన డేటాను ఎవరికో ఇచ్చేందుకు ఇంటర్నెట్ ద్వారా నిరంజయ్ అయ్యర్ (ఆదిత్ అరుణ్) బేరసారాలు చేస్తుంటాడు. ఇతడిని రాజశేఖర్ అరెస్ట్ చేస్తాడు. ఆపై శేఖర్‌, నిరంజన్‌ని చంపాలని కొందరు ప్లాన్ చేస్తారు. వారెవరు.. నిరంజన్ దగ్గరున్న ఆ డేటా ఏంటని అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  
 
విశ్లేషణ: 
నటీనటుల విషయానికి వస్తే రాజశేఖర్ రెండేళ్ల తర్వాత తెరపై కనిపించినా యాక్షన్ పరంగా అదరగొట్టాడు. నటన పరంగా, యాక్షన్‌ సన్నివేశాల్లో రాజశేఖర్‌ చక్కగా నటించాడు. గృహిణి పాత్రలో నటించిన పూజా కుమార్‌ పాత్రకు న్యాయం చేసింది. కీలక పాత్ర చేసిన ఆరుణ్‌ ఆదిత్‌, రాజకీయ నాయకుల పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, డాక్టర్స్‌ పాత్రలో నటించిన అలీ, పృథ్వీ, ఎన్‌ఐఏ చీఫ్‌ ఆఫీసర్‌గా నటించిన నాజర్‌, ఇక ఎన్‌ఐఏ సభ్యులుగా రవివర్మ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. 
 
సినిమాలో జార్జ్ అనే మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టుడు కిషోర్ న‌ట‌న చాలా బావుంది. సాంకేతికంగా చూస్తే, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సినిమాను చక్కగా తెరకెక్కించాడు. సన్నిలియోన్‌ స్పెషల్‌ సాంగ్‌ మాస్‌ సినిమాకు హైలైట్. సినిమాటోగ్రఫీ కూడా రిచ్‌గా ఉంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అణు పరీక్షలు అనే ఓ అంశాన్ని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు వీలైన మేర అర్థమయ్యేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందా? అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.
 
ప్లస్‌ పాయింట్స్‌: 
నటీనటులు
బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ 
యాక్షన్‌ సీన్స్‌ 
సినిమాటోగ్రఫీ 
 
మైనస్‌ పాయింట్స్‌: 
సినిమా వ్యవధిని తగ్గించకపోవడం 
కామెడీ లేకపోవడం
స్పీడును తగ్గించే సన్నివేశాలు.
రేటింగ్‌: 3/5.

#PSVGarudaVega will be a comeback film for Rajasekhar: Megastar Chiranjeevi pic.twitter.com/6s2ZjN4gOg

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు.. ఇది హిందూ ఉగ్రవాదం కాదా? #justasking