Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ వయస్సులో వారు అలా చేయకూడదన్నారు... గరుడవేగ సెన్సార్ కష్టాలపై..

రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం సెన్సార్ సమస్య గురించి ఆ చిత్ర దర్శకుడు చెపుతూ... 'చందమామ కథలు' కూడా సెన్సార్‌ సమస్య వచ్చింది. సీనియర్‌ నరేష్‌, ఆమని ఓ సన్నివేశంలో ముద్దు పెట్టుకోవాలి. ఆ వయస్సులో వారు అలా చేయకూడదని కట్‌ చెప్పారు. కథ లోని ఫీల్‌ను చూడమన

ఆ వయస్సులో వారు అలా చేయకూడదన్నారు... గరుడవేగ సెన్సార్ కష్టాలపై..
, బుధవారం, 1 నవంబరు 2017 (20:54 IST)
రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం సెన్సార్ సమస్య గురించి ఆ చిత్ర దర్శకుడు చెపుతూ... 'చందమామ కథలు' కూడా సెన్సార్‌ సమస్య వచ్చింది. సీనియర్‌ నరేష్‌, ఆమని ఓ సన్నివేశంలో ముద్దు పెట్టుకోవాలి. ఆ వయస్సులో వారు అలా చేయకూడదని కట్‌ చెప్పారు. కథ లోని ఫీల్‌ను చూడమన్నా. కానీ వినలేదు. సెన్సార్‌ అంటే ప్రభుత్వం ఉద్యోగంలా భావిస్తున్నారు. ఏదో సంతకాలు పెట్టి సాయంత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో 10 కట్స్‌ చెప్పారు. 
 
ప్రభుత్వం ఉద్యోగులు, మంత్రులు చాలా మంచోళ్ళు. తిట్టకూడదన్నారు. సినిమా కథలోని వ్యక్తులు చెడు పనులు చేసే వారిని తిట్టకుండా ఎలా వుంటాం? అంటే ప్రశ్నించే తత్త్వం లేకుండా ఎలాగండి? అని అడిగితే, వినలేదు. మనం చైనాలోనో, ఉత్తర కొరియాలో బతుకుతున్నామా... అని నాకనిపించింది. మనం గూగుల్‌‌ను ఫ్రీగా వాడతాం. వాటిలో ఎన్నో చెడు విషయాలుంటాయి. చైనా, కొరియాల్లో నిబంధనలుంటాయి. 
 
అదేవిధంగా 'ప్రతిఘటన' సినిమా ఇప్పుడయితే విడుదలయ్యేది కాదోమో. అమితాబ్‌ సూపర్‌స్టార్‌ అయ్యారంటే.. అప్పటి సమాజంలో వున్న హెచ్చుతగ్గులు, అన్యాయాన్ని పోరాడితేనే స్టార్‌ అయ్యాడు. ప్రభుత్వం అంతా మంచే చేస్తుందని చూపించాలంటే ఎట్లా? అలా మంచి చూపించే 'స్మోకింగ్‌ యాడ్స్‌' చూసి జనాలు విసుక్కుంటున్నారు. ఆ యాడ్‌ తర్వాతే థియేటర్‌కు వెళుతున్నారు అంటూ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య‌వాడ‌లో శిల్పారామం క్రాప్ట్ మేళా... నవంబర్ 3 నుండి 12 వ‌ర‌కూ...