Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదిరింది రివ్యూ రిపోర్ట్.. విజయ్, నిత్య అదరగొట్టేశారు.. ఆ సీన్స్‌కు కత్తెర

రూ.5లకే వైద్యం అందించే భార్గవ్ (విజయ్)కు అవార్డు అందించేందుకు విదేశాల నుంచి పిలుపు వస్తుంది. దీనికోసం ఫారిన్ వెళ్లే భార్గవ్‌కు కాజల్ పరిచయం అవుతుంది. ఇంతలో భారత్‌లో వరుసగా కిడ్నాప్‌లు జరుగుతాయి. ఇందుక

Advertiesment
Adirindi movie review
, గురువారం, 9 నవంబరు 2017 (16:58 IST)
సినిమా: అదిరింది 
తారాగణం: విజయ్, సమంత, కాజల్‌ అగర్వాల్‌, నిత్యామేనన్, ఎస్‌.జె.సూర్య, సత్యరాజ్‌, వడివేలు తదితరులు 
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌ 
నిర్మాత: శరత్‌ మరార్‌ 
కథ, కథనం, దర్శకత్వం: అట్లీ 
 
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటించిన మెర్సల్ తెలుగులో అదిరిందిగా విడుదలైంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘కత్తి’ కథనే చిరంజీవి తన 150వ చిత్రంగా రీమేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతటి పవర్ స్టోరీలతో మాస్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్.. తాజాగా అదిరింది ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. 
 
దీపావళి సందర్భంగా తమిళంలో విడుదలైన మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమాను వివాదాలు వదల్లేదు. ముఖ్యంగా జీఎస్‌టీ, నోట్లరద్దు వంటి సున్నిత అంశాలపై సినిమాలో చర్చించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులోనూ అదిరిందిగా వచ్చేసింది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే.. 
రూ.5లకే వైద్యం అందించే భార్గవ్ (విజయ్)కు అవార్డు అందించేందుకు విదేశాల నుంచి పిలుపు వస్తుంది. దీనికోసం ఫారిన్ వెళ్లే భార్గవ్‌కు కాజల్ పరిచయం అవుతుంది. ఇంతలో భారత్‌లో వరుసగా కిడ్నాప్‌లు జరుగుతాయి. ఇందుకు కారణం భార్గవ్ అని తెలుస్తుంది. మరోవైపు భార్గవ్‌కు అవార్డు అందించిన డాక్టర్‌ హత్యకు గురవుతాడు. ఈ హత్యలకీ, కిడ్నాప్‌లకు ఉన్న లింకేంటి? వైద్య రంగంలో లోపాలను భార్గవ్‌ ఎలా ఎత్తి చూపించాడు అనేదే కథ. 
 
విశ్లేషణ:
సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు జోడించడంతో దర్శకుడు అట్లీ సఫలమయ్యాడు. సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ఠాగూర్, శివాజీ పోలికలున్నా అట్లీ తనదైన ముద్ర వేసుకున్నాడు. విజయ్‌ ద్విపాత్రాభినయం ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో విజయ్‌, నిత్యామేనన్‌, ఎస్‌.జె. సూర్యల మధ్య నడిచే ఆస్పత్రి ఎపిసోడ్‌ కథకు బలాన్నిచ్చింది.

ఫ్లాష్‌బ్యాక్‌ సమన్వయం బాగుంది. ప్రభుత్వాసుపత్రులు ఎలా వుండాలి. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడిని విజయ్ అదిరింది ద్వారా ఎండగట్టేశాడు. ఇక జీఎస్‌టీ.. నోట్లరద్దు.. లాంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన సన్నివేశాలకు తెలుగులో కత్తెర్లు పడ్డాయి. మరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే వేచి చూడాలి. 
 
నటీనటులు.. 
విజయ్ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. సమంత, కాజల్‌ పాత్రలు చిన్నవే. గెస్ట్ రోల్స్ వంటివి. నిత్యామేనన్ నటనతో అదరగొట్టింది. ఎస్‌.జె.సూర్య విలన్‌గా అదరగొట్టేశాడు. రాబోయే 30ఏళ్లలో వైద్య రంగం ఎలా వ్యాపార రంగంగా మారుతుందో చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలే అర్థం కాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. అట్లీ ఒక బలమైన కథను తీసుకుని, దానికి వాణిజ్య అంశాలను జోడించాడు.
 
పాజిటివ్ పాయింట్లు 
విజయ్ నటన
కథ, కథనం  
 
మైనస్
ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లేలో కాస్త గందరగోళం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్ ద్రావిడ్‌ను ప్రేమించానంటున్నట్టు దేవసేన