Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహ‌రి కొడుకు మేఘాంశ్ సినిమా ప‌రిస్థితి ఏంటి..? శ్రీహరి బ్రతికుంటే ఇలా ఉండేదా..?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (19:22 IST)
రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం రాజ్ దూత్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా గురించి అస‌లు టాకే లేదు. ఇంకా చెప్పాలంటే... ఈ సినిమా రిలీజైంద‌నే విష‌య‌మే చాలామందికి తెలియ‌దు. దీనికి కార‌ణం... స‌రిగా ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోవ‌డ‌మే. ఇండ‌స్ట్రీ జ‌నాలు కూడా ఈ సినిమాకి స‌రైన స‌హ‌కారం అందించ‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీహ‌రి స‌తీమ‌ణి శాంతి కొంతమంది ప్ర‌ముఖుల‌ను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ వారి నుంచి స‌రైన స‌మాధానం రాలేద‌ట‌.
 
దీంతో కొంతమందితో బైట్స్‌తో తీసుకుని వాటిని ప్ర‌మోష‌న్స్‌కి వాడారు. అయితే... శ్రీహ‌రి బ‌తికుంటే ఇలా జ‌రిగి ఉండేదా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇండ‌స్ట్రీ మొత్తం క‌దిలి వ‌చ్చేది. ఆయ‌న లేక‌పోవ‌డంతో ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. 
 
రెండున్న‌ర కోట్ల‌తో ఈ సినిమాని తీసార‌ట‌. ఓపెనింగ్స్ కూడా స‌రిగా రాలేదు. దీంతో పెట్టుబ‌డి ఎంతవ‌ర‌కు రాబ‌డుతోంది అనేది క్లారిటీ లేదు. మేఘాంశ్ స‌క్స‌ెస్ సాధించాలంటే ప్రోప‌ర్‌గా పబ్లిసిటీ చేయాలి. వ‌య‌సుకు త‌గ్గ క‌థ ఎంచుకోవాలి. మ‌రి.. రెండో సినిమాకైనా స‌రైన రీతిలో ప్లాన్ చేసుకుని స‌క్స‌స్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments