Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివబాలాజీ, కౌషల్ పరిస్థితి ఏమిటి.. వెనకడుగు వేస్తున్న సెలబ్రిటీలు

Advertiesment
Problems
, సోమవారం, 8 జులై 2019 (11:32 IST)
ఇప్పటికే తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైంది, ఇక తెలుగుతో కూడా బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో కనిపిస్తున్న హోస్ట్ నాగార్జునగా కన్ఫామ్ కాగా, ఇంకా ఇంటి సభ్యులుగా ఎవరెవరు ఎంటర్ కాబోతున్నారనే దానిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
 
తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మొదలైనప్పటి నుంచే బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందింది. ఇక ఈ సీజన్‌లో ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడంతో ఈ షోకి సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఆ పాపులారిటీని అలాగే పెంచుతూ న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2ను విజయవంతం చేశారు. ఇక సీజన్ 3పై అంచనాలు పెరిగిపోవడంతో ఈ హోస్టింగ్ బాధ్యతలను సీనియర్ హీరో నాగార్జునకు అప్పగించారు. 
 
అధికారికంగా ప్రకటన ఏదీ జరగకపోయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ 3 జులై 21న మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే హౌస్‌మేట్స్ విషయంలో కొన్ని పేర్లు బయటకు వస్తున్నప్పటికీ ఆయా సెలబ్రిటీలు వెంటనే ఖండిస్తూ వస్తున్నారు.
 
100 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండటం కష్టం అనిపించడంతో చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఇందువల్లనే బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని సమాచారం.
 
అలాగే మరో కారణం ఏమిటంటే పాపులారిటీ, అవకాశాల కోసం ఇందులో పాల్గొనడానికి ఒప్పుకునే సెలబ్రిటీలు గత రెండు సీజన్లలో విన్నర్లుగా నిలిచిన శివ‌బాలాజీ, కౌశల్ పరిస్థితి చూసి వెనకడుగు వస్తున్నారంట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాంచాలీకి ఐదుగురు భర్తలు.. నాకైతే 15మంది భర్తలు.. ఆడై అమలాపాల్