పాంచాలీకి ఐదుగురు భర్తలు.. నాకైతే 15మంది భర్తలు.. ఆడై అమలాపాల్

ఆదివారం, 7 జులై 2019 (13:25 IST)
ఆడై సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమలా పాల్ గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ సినిమాలో అమలాపాల్ బోల్డ్‌గా నటించడమే ఇందుకు కారణం. మేయాద మాన్ సినిమా ఫేమ్ దర్శకుడు రత్నకుమార్ ఈ సినిమాను రూపొందించాడు. వీజే రమ్య, వివేక్, ప్రసన్న తదితరులు నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో ఆడై సినిమా ఆడియో ఫంక్షన్‌లో అమలాపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు సంబంధించిన కథలు ఎక్కువగా విన్నాను. అయితే అవి అంతగా నచ్చలేదు. దీంతో ఇక లాభం లేదని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామనుకున్నాను. ఆ సమయంలోనే రత్నకుమార్ ఆడై సినిమా కథను వినిపించారు. స్క్రిప్ట్ బాగా నచ్చింది. తన తొమ్మిదేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి కథను తాను వినలేదని.. స్టోరీ విభిన్నంగా వుండటంతో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని అమలా పాల్ వెల్లడించింది. 
 
ఇకపోతే.. ఆడై సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నప్పుడు తన చుట్టూ 15మంది వున్నారు. అందులో లైట్‌ మ్యాన్‌తో పాటు అందరినీ బయటికి పంపించేశారు. అందరి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే తాను సేఫ్ అనుకున్నాను. పాంచాలీకి ఐదుగురు పురుషులు అంటూ చెప్తుంటారు. అలాగే తనకు 15 మంది పురుషులు వున్నట్లు ఫీలయ్యాను. నగ్నంగా నటించేటప్పుడు తనకు వారు చేసిన సపోర్ట్‌ను బట్టే.. భయం లేకుండా నటించగలిగాను. ఈ సినిమా కోసం తనతో నటించిన ప్రతి ఒక్కరికీ, సహకరించిన అందరికీ అమలా పాల్ కృతజ్ఞతలు తెలియజేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దుస్తులేసుకోకుండా పుట్టినరోజు జరుపుకునే అమలాపాల్- ''ఆడై'' సెన్సేషనల్ ట్రైలర్ (Video)