ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా వీడియో ద్వారా ప్రకటించింది. బుల్లితెరపై నెంబర్ వన్ రియాల్టీ షోగా ఇది దూసుకుపోతోంది. తెలుగులో ఈ షో మొదలై రెండు సీజన్‌లను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే పార్టిసిపెంట్స్ గురించి ఓ లిస్టు కూడా రెడీ అయ్యింది. ఈ లిస్టులో శ్రీముఖి, జాహ్నవి, జ్వాలా గుత్తా ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే తీన్మార్ సావిత్రి కూడా బిగ్ బాస్-3లో పాల్గొనే ఛాన్సుందని టాక్ వస్తోంది. అలాగే ఉప్పల్ బాబు కూడా బిగ్ బాస్‌లోకి వస్తానంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇతనిదే.
తన వెరైటీ పెర్ఫామెన్స్‌తో పటాస్, జబర్దస్త్ షోలలో ఛాన్స్ కొట్టేసిన ఉప్పల్ బాలు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌లోకి వస్తే తన దశ మారిపోతుందని.. తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటానని చెప్తున్నాడు.
మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు హౌస్‌లోకి రావచ్చునని.. అలాగే వివాదస్పద నటి శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తే ఇక షో మామూలుగా వుండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.