Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

చిత్రాసేన్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (10:41 IST)
Vishnu Vishal, Shraddha Srinath
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్.. ఆర్యన్ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు.  విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటనకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
 
ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు.
 
సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
 
విష్ణు విశాల్  FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, గిబ్రాన్ సంగీతం, శాన్ లోకేష్  ఎడిటర్.
ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబరులో వివాహం జరగాల్సింది.. ఇంతలోనే రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయాడు.. (video)

కరీంనగర్‌లో సామూహిక అత్యాచారం.. వాట్సాప్‌ గ్రూపుల్లో వీడియో వైరల్

నేడు ఢిల్లీలో ఏపీ భవిష్యత్‌ను మార్చే కీలక ఒప్పందం..

ఖమ్మంలో దారుణం : 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా టీచర్ లైంగిక దాడి - తెలియగానే సూసైడ్

ఇద్దరు కవల పిల్లలను చంపిన తల్లి ... ఆపై భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments