Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

Advertiesment
Vishnu Vishal, Aryan

చిత్రాసేన్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (18:47 IST)
Vishnu Vishal, Aryan
శుభ్ర & ఆర్యన్ రమేష్ తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్ ని తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు.
 
34 నెలల విరామం తర్వాత, విష్ణు విశాల్ ఈ శక్తివంతమైన టీజర్ తో సోలో లీడ్ గా కం బ్యాక్ ఇచ్చారు. 'రాట్ససన్' విజయం తర్వాత, విష్ణు విశాల్ మరోసారి 'ఆర్యన్' లో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్   అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ నటించిన FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత.
 
ఆర్యన్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్  మ్యూజిక్ లాంచ్ అప్‌డేట్‌లు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం - విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది