Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

చిత్రాసేన్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (10:34 IST)
Mitra Mandali team with Sri Vishnu
తిప్పరామీసం టైంలో విజయ్ ఏడీగా పని చేశారు. మిత్ర మండలి పెద్ద హిట్ అవుతుంది. విజయ్ కోసం ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ ఇలా అందరూ నాకు ఇష్టం. ప్రియదర్శి ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాడు. ఆయన మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇలానే ఎప్పుడూ మంచి కథలు, సినిమాల్ని చేస్తూ వెళ్లాలి అని శ్రీ విష్ణు అన్నారు.
 
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన మిత్రమండలి అక్టోబర్ 16 నాడు విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా గత రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కథనాయకుడు శ్రీవిష్ణు హాజరయ్యారు. ఆయన ఇలా మాట్లాడారు.
 
శ్రీ విష్ణు మాట్లాడుతూ,  నిహారిక రీల్స్ నేను చూస్తుండేవాడిని. తెలుగులో ఆమె ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలి. ఈ చిత్రంలో పాటలు బాగున్నాయి. నిర్మాతలైన కళ్యాణ్, భాను, సోము, విజేందర్ అందరూ కూడా నాకు స్నేహితులు. బన్నీ వాస్ గారు నెలకి ఒక సూపర్ హిట్ మూవీని అందిస్తున్నారు. ఆయన ఉన్నారంటే సినిమా హిట్ గ్యారెంటీ. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టే అక్టోబర్ 15న ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ‘మిత్ర మండలి’ ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి థియేటర్‌ నుంచి బయటకు పంపించేస్తుంది’ అని అన్నారు.
 
ప్రియదర్శి మాట్లాడుతూ .. సినిమా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ మూవీని చూశాను. ఈ చిత్రం మీకు నచ్చకపోతే.. నెక్ట్స్ వచ్చే నా ఏ సినిమాని కూడా చూడకండి. మిత్ర మండలితో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకు వస్తున్నాం. అక్టోబర్ 16న ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
 
బన్నీ వాస్ మాట్లాడుతూ, దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్టైనర్‌. నా టీం ట్రైలర్‌ కింద నెగెటివ్ కామెంట్లు చూపించింది. ఎక్కడ నవ్వాలి అనే కామెంట్ ఉంది. సినిమాకు రండి ప్రతీ సీన్‌కు నవ్వుతారు. నా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు ఆడాలి.. అన్నీ హిట్ అవ్వాలి. నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. నేను ధర్మం వైపు ఉంటాను అని అన్నారు.
 
డైరెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ* .. నేను శ్రీ విష్ణు గారి తిప్పరామీసం సినిమాకు మొదటి సారిగా పని చేశాను. అలా నా జర్నీ ప్రారంభమైంది. నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ‘మిత్ర మండలి’ సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
నిర్మాత భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ, సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. హేటర్స్ వల్లే మేం మరింతగా ముందుకు వెళ్తున్నాం. మా చిత్రం చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ నవ్విస్తాం’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబరులో వివాహం జరగాల్సింది.. ఇంతలోనే రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయాడు.. (video)

కరీంనగర్‌లో సామూహిక అత్యాచారం.. వాట్సాప్‌ గ్రూపుల్లో వీడియో వైరల్

నేడు ఢిల్లీలో ఏపీ భవిష్యత్‌ను మార్చే కీలక ఒప్పందం..

ఖమ్మంలో దారుణం : 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా టీచర్ లైంగిక దాడి - తెలియగానే సూసైడ్

ఇద్దరు కవల పిల్లలను చంపిన తల్లి ... ఆపై భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments