తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

చిత్రాసేన్
సోమవారం, 13 అక్టోబరు 2025 (18:27 IST)
Sidhu, Srinidhi Shetty, Rasi khanna, Neerja Kona, Kriti Prasad
సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోనైస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను  లాంచ్ చేశారు.
 
ఈ కథ కేవలం లవ్ ట్రయాంగిల్ మాత్రమే కాదు..ఇది మేల్ ఇగో, మోడరన్ ఎమోషన్ పై ఎమోషనల్ అడ్వంచర్ గా వుంది. రచన, దర్శకత్వం రెండింటిలోనూ నీరజ కోన ఆకట్టుకున్నారు. డైలాగులు శక్తివంతంగా, లోతైన భావంతో వ్వున్నాయి.  కథలో మెయిన్ ఎలిమెంట్ నేటి సమాజంలో చర్చనీయాంశమైన ఒక సెన్సిటివ్ టాపిక్ చుట్టూ తిరుగుతుంది.
 
సిద్ధు జొన్నలగడ్డ వన్ మాన్ షో అనిపించేంతగా తన నటన ఆకట్టుకున్నారు. కంట్రోల్, ఈగో, ఎమోషన్స్ తో కూడిన తన నటన నెక్స్ట్ లెవల్ లో వుంది. వైవా  హర్షాతో జరిగే డైలాగ్స్ అతని కాన్ ఫ్లిక్ట్ ని చక్కగా చూపించాయి. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ అదిరిపోయాయి.
 
శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. వైవా హర్షా తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రండ్ పాత్రలో మెప్పించారు.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..  ట్రైలర్లో ఏం చూసారో సినిమాలో కూడా అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్. బట్ తెలుసు కదా అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇది యూత్ కి ఫ్యామిలీస్ కి నచ్చే సినిమా
 
హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. ఇది ఒక రాడికల్ సినిమా అవుతుంది. ట్రైలర్ చూసి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది. డైరెక్టర్ నీరజ గారికి, హీరో సిద్దు గారికి మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..  ట్రైలర్ చూసిన తర్వాత చాలా రాడికల్ గా అనిపించింది. సినిమా కోసం నేను చాలా ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ.
 
డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ..  ఇది నా ఫస్ట్ ఫిలిం. చాలా స్పెషల్. మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా స్పెషల్. ట్రైలర్లో మీరు చూసిన దానికి పది రెట్లు సినిమాలో ఉంది. గెట్ రెడీ ఫర్ ఫన్ రైడ్. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.  
 
వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్లో కొంచెమే చూపించాము.  సినిమాలో చాలా ఉంది. అక్టోబర్ 17 అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.  
 
ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ..  యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న టీం విషయంలో ప్రౌడ్ గా వుంది. బిగ్ స్క్రీన్ మీద మీ అందరికీ సినిమా చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాము .అక్టోబర్ 17న  సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments