Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Advertiesment
Niharika NM

చిత్రాసేన్

, గురువారం, 9 అక్టోబరు 2025 (15:02 IST)
Niharika NM
ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. అని హీరోయిన్ నిహారిక ఎన్ ఎం అన్నారు.
 
ఇన్ స్టాగ్రాంలో రీల్స్, ఇన్ ఫ్లూయెన్సర్‌గా ప్రచారం పొందిన నిహారిక ఎన్ ఎం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన మీమ్స్, స్కిట్స్ తో పాపులర్ అయ్యారు. ఆ గుర్తింపుతో తెలుగులో మిత్ర మండలి అనే చిత్రానికి నాయికగా ఎంపికయ్యారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా విజయేందర్ దర్శకుడిగా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రమిది. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ నిహారిక ఎన్ ఎం పలు విషయాలు తెలియజేశారు.
 
- నేను ముందుగా ఈ మిత్ర మండలి కథనే విన్నాను. కానీ పెరుసు అనే తమిళ చిత్రం ముందుగా రిలీజ్ అయింది. మిత్ర మండలి లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
 
-  ఈ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.
 
- ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు.  షూటింగ్‌లో ఉండగానే ప్రియదర్శి నటించిన కోర్ట్ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.
 
- భవిష్యత్తులో ఎలాంటి పాత్రలను చేయాలంటే... నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా.
 
- విజయం వచ్చినప్పుడు సంతోషించినట్టే పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.
 
- తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్‌లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్