Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Advertiesment
Anupama Parameswaran

దేవీ

, గురువారం, 21 ఆగస్టు 2025 (18:57 IST)
Anupama Parameswaran
పరదా చాలా కొత్త కథ. ఇలాంటి కథలు తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో కూడా చాలా అరుదు. ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్టు నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. డైరెక్టర్ ప్రవీణ్ నాకు కథ చెప్పినప్పుడు పరదాలోనే నా క్యారెక్టర్ ఎక్కువగా కనిపించింది. బాడీ లాంగ్వేజ్ డైలాగ్ తో ఎలా నటించగలను అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాని చేయడం జరిగింది అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.
 
సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' రూపొందించారు. దర్శన రాజేంద్రన్‌, సంగీత  కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించారు. ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
-ఇందులో చాలా సీన్స్  నేను సైలెంట్ గా ఉండొచ్చు. కానీ పరదా వెనుక నా క్యారెక్టర్ ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రీమియర్స్ చూసిన చాలా మంది ఆడియన్స్ నేను కేవలం కళ్ళతోనే కాదు బాడీ లాంగ్వేజ్, వాయిస్ తో కూడా యాక్ట్  చేయగలనని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పరదా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  
 
-ఈ కథ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చాలా సోల్ ఫుల్ ఫిలిం. ఒక యాక్టర్ గా ఛాలెంజింగ్ గా ఉండే రోల్ చేశాను.
 
-ఈ కథకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. కచ్చితంగా మీరు క్యారెక్టర్స్ తో రిలేట్ అవుతారు.
 
- ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికి కూడా ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు. ఆడియన్స్ చూసినప్పుడు అక్కడ చెప్పిన పక్షి కథ ఖచ్చితంగా మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ఆ సినిమా కథ మొత్తం ఆ సీన్ లోనే ఉంది.
 
- పరదా ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించగలిగిన అది సక్సెస్ గా భావిస్తాను.
 
- ఇందులో ఒక హోటల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ లో మేమందరం గొడవ పడతాము, అలా మొదలైన మా కెమిస్ట్రీ చాలా అద్భుతంగా సాగింది. దర్శన సంగీత తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాతో మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం.
 
- గోపి సుందర్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్ లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేసాయి.  కారులో కూర్చుని నాలో నేనే ఏడ్చేసాను. చాలా ఎమోషనల్ అయిపోయాను. గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రతి సాంగ్ కి మీనింగ్ ఉంటుంది. ద బెస్ట్ వర్క్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్