Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Advertiesment
Chiranjeevi's Vishwambhara Latest Poster

దేవీ

, గురువారం, 21 ఆగస్టు 2025 (18:24 IST)
Chiranjeevi's Vishwambhara Latest Poster
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర మరో ఏడాదికి మారింది. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే సినిమా గురించి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ విశ్వంలో అసలేమి జరిగిందో  ఈరోజుైనా చెబుతావా? మురా? అంటూ చిన్నపిల్లవాడి వాయిస్ తో ప్రారంభమవుతోంది. ఒక సంహారం దాని తాలూకు యుద్ధం అని శర్మ గంభీరమైన వాయిస్ తో వస్తుంది. ఆ వెంటనే రకరకాల కీటకాలు కనిపిస్తాయి. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి హద్దులేని భయాన్నిఇచ్చిందంటూ వాయిస్ తోపాటు బాకులతో రక్తంతో కూడిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చూపించారు. ఆ తర్వాత 2026 సమ్మర్ లో థియేటర్ కు వస్తుందని ట్విస్ట్ ఇచ్చారు.
 
ఈ సినిమా జాప్యానికి కారణం టెక్నాలజీకి చెందిన విషయాలనేది అందరికీ తెలిసిందే. దాన్ని చిత్ర టీమ్ ఇంతవరకు ప్రకటించలేదు. అరా కొరగా దర్శకుడు వశిష్ట కొన్ని మీడియా ఛానల్ లో వెల్లడించారు. తాజాగా నేడు చిరంజీవి సాంకేతికంగా మరింతగా చూపించాల్సి రావడంతో వాయిదా పడిందంటూ  వెల్లడించారు. 
 
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష‌, అషికా రంగ‌నాథ్‌, ర‌మ్య ప‌సుపులేటి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిరంజీవి 156 చిత్రంగా రాబోతోంది. సినిమాలో జగదేగవీరుడు అతిలోక సుంధరి తరహాలో వివిధ లోకాలు చూపించే క్రమంలో సత్య లోకం అనేది కొత్తగా  క్రియేట్ చేయడంవల్ల సినిమా దాదాపు స‌గం విఎఫ్ఎక్స్ పైనే ఆధార ప‌డి ఉండ‌డంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి పూర్తిగా విజువ‌ల్స్, వీ ఎఫ్‌క్స్ పైనే దృష్టి సారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం