1960లలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా భోగీ చిత్రం రూపొందించబడిందని చెబుతున్నారు. కథానాయకుడిగా శర్వానంద్ కు 38వ సినిమా. సంపత్ నంది దర్శకత్వంలో ఇటీవలే యాక్షన్ విజువల్ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
నేడు డింపుల్ జన్మదినం సందర్భంగా పోస్టర్ లుక్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్. చాలాకాలం నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు డింపుల్, శర్వా. ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతుండడం వారి ఆశలను పెట్టుకున్నారు.
ఇంతకుముందే శర్వా పోస్టర్ ను కూడా విడుదలయింది. భోగి కొడవలిపై కనిపించడం మనం చూశాము. దర్శకుడు సంపత్ నంది హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు.షూటింగ్ శరవేగంగా జరుగుతున్న చిత్రీకరణ ప్రస్తుతం కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది. కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ లో లక్మీ రాంమోహన్ సమర్పిస్తున్నారు.