Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

Advertiesment
Sharwa

దేవీ

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (17:12 IST)
Sharwa
కథానాయకుడు శర్వా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా రివిల్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
 
దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను నరేట్ చేస్తుండగా ఈ వీడియో సినిమా ఎసెన్స్ చూపిస్తుంది. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా 'భోగి' టైటిల్ రివిల్ అవుతుంది. ఈ టైటిల్ కొత్త శక్తి, తిరుగుబాటును ప్రజెంట్ చేస్తోంది. వీడియోలో ప్రజెంట్ చేసినట్లుగా శర్వా నెవర్ బిఫోర్ పాత్రలోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్ లో ప్రారంభమైయింది. వీటిలో కొన్ని భాగాలను కాన్సెప్ట్ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ విజన్ ని జీవం పోయడానికి  ప్రొడక్షన్ టీం ఆరు నెలలు డెడికేషన్ తో వర్క్ చేసి, దాదాపు 20 ఎకరాల భూమిని బ్రెత్ టేకింగ్ బ్యాక్ డ్రాప్ గా మార్చింది.
 
1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో 'భోగి' టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.  కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ కాగ, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, ఎడిటర్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తారు. భోగి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!