ఉమెన్ సెంట్రిక్ కథతో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న చిత్రం పరదా. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించారు. సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ డొంకడ పలు విషయాలు తెలియజేశారు.
పరదా కథను ప్రవీణ్ గారితో చేయడానికి గల కారణం ఏమిటి?
ప్రవీణ్ నేను మొదట్లో ఓ కథను దుల్కర్ సల్మాన్ తో చేయాలని అనుకున్నాం. అది కూడా రాజ్ డికె. ప్రొడక్షన్ అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆతర్వాత ఆనందిమీడియాలో చేద్దామనుకున్నప్పుడు ప్రవీణ్ చెప్పిన ఐడియా నచ్చింది. ఆనంది మీడియాలో చేయాలంటే చాలా గొప్ప కథతో చేయాలనుకున్నాం. కథ విన్నాక బేనర్ కూ, ఇండస్ట్రీకి గుర్తిండిపోయే సినిమా అవుతుందనిపించింది. అలా పరదా మొదటి అడుగు పడింది.
రియల్ సంఘన ఆధారంగా చేసుకుని తీశారా?
కాదండి. ఎక్కడా రియల్ సంఘటన వుండదు. కానీ కథ మొదలు కావడానికి కొంత ఇన్ స్పిరేషన్ వుంటుంది. రన్నింగ్ అంతా కల్పితంగా చూపించాం.
అనుపమను మొదటే అనుకున్నారా? వేరే ఛాయిస్ అనిపించిందా?
కథ ఆరంభంలోనే నేను, ప్రవీణ్ కలిసి చర్చించుకున్నప్పుడు అనుపమనే మా మైండ్ లో వుంది. ఆమె కరెక్ట్ అని భావించాం. ఆమెకు కథను నాలుగు గంటలు చెప్పాం. చాలా ఉత్సాహంగా విన్నది. వెంటనే చేస్తానని ముందుకు వచ్చింది.
ఈ సినిమాను వేరే భాషల్లో విడుదల చేస్తున్నారా? మన చిత్రాలు అక్కడ పెద్దగా ఆడడంలేదుగదా?
మన ఇండస్ట్రీలో పెక్యూలర్ ఆడియన్స్ వున్నారు. దానితో వేరే భాషల మన దగ్గర ఆడుతున్నాయి. కానీ మనవి అక్కడ ఆడడంలేదు. ఓటీటీలు వచ్చాక ప్రేక్షకుల ఆలోచన విధానం మారిందనిపిస్తుంది. కుబేర సినిమా కూడా తెలుగులో బాగా ఆడింది. తమిళ్ లో పెద్దగా ఆడలేదు. ఏది ఏమైనా ఆడియన్స్ లో కొంత మార్పు అయితే వచ్చింది. ఫైనల్ గా దర్శకుడు ఎవరు? అనేది చూడకుండా కంటెంట్ ఎలా వుందనేది మన దగ్గర చూస్తున్నారు. ఆ కోవలోనే కాంతార వంటి సినిమాలు బాగా ఆడాయి.
అసలు ఈ పరదా నే ఏవిధంగా నిర్వచిస్తారు?
పరదా వేసుకుని బయటకు వస్తే ఒకలా వుంటారు. కానీ ఆ పరదా ముసుగులో మరో మనిషి వుంటారు. ప్రతి ఒక్కరికి ఒక ముసుగు వుంటుంది. ఇన్నర్ ముసుగులో ఏం వుంటుందనేది సినిమాలో చెప్పాం. అది చూస్తే మీకే అర్థమవుతుంది.
ఇందులో ఏదైనా సందేశం వుంటుందా?
మెసేజ్ అనేది చూస్తే తెలుస్తుంది. ఏ సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకునే ఎలా బయటపడింది అనేది సినిమా. ఉమెన్స్ కు ఆ సమస్యలేమిటి? వాటిని ఎలా ఎదుర్కొంది అనేది ఆసక్తికరంగా వుంటుంది. పెద్దగా సందేశం అనేది వుండకపోయినా అంతర్లీనంగా ఓ మెసేజ్ వుంటుంది.
అనుపమను బేస్ చేసుకుని థియటర్ జనాలు వస్తారా?
కంటెంట్ హెల్ప్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా స్టార్స్ హెల్ప్ చేస్తారు. పరదా సినిమాకు అన్నీ కుదిరాయి. కథ విన్నప్పుడు కానీ, ఫస్ట్ కాపీ చూశాక కూడా మాకు చాలా కొత్తగా అనిపించింది. అదే ఫీలింగ్ ఆడియన్స్ కు కథ చాలా కొత్తగా వుంటుంది. సీన్స్ కూడా సరికొత్తగా అనిపిస్తాయి. డిఫెనెట్ గా అనుపమ పర్ ఫెక్ట్ అని చూసిన వారే చెబుతారు.
పరదా కథను ఒక్క లైన్ లో చెప్పాలంటే ఎలా చెబుతారు?
పరదా అంటే.. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని చెప్పగలను. ఇందులో ప్రేమ కథ కూడా వుంటుంది. ఓ ఊరిలో పరదా కల్చర్ ను ఫాలో అవుతున్న అమ్మాయికి ఆ ఊరిలో సమస్య ఏమిటి? దాన్ని ఎలా ఎదుర్కొంది. దానికి ఇద్దరు అమ్మాయిల సపోర్ట్ తో ఎలా తోడయింది అనేది కథ. ఇది ఫిక్షన్. ఎవరినీ హర్ట్ చేసే విధంగా వుండదని గట్టి చెప్పగలను.
అనుపమ గారు ప్రమోషన్ ను పర్సనల్ గా తీసుకున్నారు?
అవునండి. ఆమె కథ వినగానే బాగా కనెక్ట్ అయ్యారు. తన చుట్టు జరిగే కథ కాబట్టి ఓన్ గా తీసుకున్నారు. ఫస్ట్ కాపీ చూసి బెస్ట్ సినిమాఅవబోతుందని కితాబిచ్చారు. అందుకే ప్రమోషన్ పై చాలా కేర్ తీసుకుంటున్నారు.