Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Advertiesment
Kishkindapuri Poster

దేవీ

, సోమవారం, 11 ఆగస్టు 2025 (11:05 IST)
Kishkindapuri Poster
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్ కమింగ్ హారర్-మిస్టరీ థ్రిల్లర్ కిష్కిందపురిలో బోల్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మహిళా కథానాయికగా నటించింది. హారర్, మిస్టరీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో వస్తున్న కిష్కిందపురి ఈ సీజన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీలో ఒకటి. 
 
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ సస్పెన్స్ మరింత పెంచింది, ఆయన ముందు ఒక వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెర్రిఫిక్ మాన్షన్‌ తో పాటు మంటల్లో కాలి పోతున్న వాన్‌ కనిపించడం థ్రిల్లింగ్ గా వుంది 
 
ఫస్ట్ గ్లింప్స్‌లోనే ప్రేక్షకులు సినిమా సస్పెన్స్‌ ప్రిమైజ్ ని ఫీల్‌ అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌ "ఉండిపోవే నాతోనే" మాత్రం పూర్తిగా వేరే మూడ్‌ సెట్ చేసింది. కథలో టెన్షన్‌తో పాటు ఒక రొమాంటిక్‌ షేడ్ ని ప్రజెంట్ చేసింది. 
 
డైరెక్టర్‌ కౌశిక్ పెగళ్లపాటి, కిష్కిందపురి డార్క్, మిస్టీరియస్‌ వరల్డ్‌ను చూపిస్తూ, దానికి కాంట్రాస్ట్‌గా ఎమోషనల్ మూమెంట్స్ ని చక్కగా మిక్స్‌ చేశారు. కథ ముందుకు సాగే కొద్దీ థ్రిల్ల్స్‌తో పాటు ఎమోషన్స్‌ కలిసిన లేయర్డ్‌ ఎక్స్పీరియెన్స్‌ ఇవ్వబోతోంది. 
 
సినిమా కోసం టాలెంటెడ్‌ టెక్నికల్ టీం పని చేస్తోంది. సామ్‌ సి.ఎస్ మ్యూజిక్. చిన్మయ్ సలస్కర్ డీవోపీ, ప్రొడక్షన్ డిజైన్ మనిషా ఎ. దత్, ఆర్ట్ డైరెక్టర్ డి.శివ కమెష్, ఎడిటింగ్‌ నిరంజన్ దేవరమనే. క్రియేటివ్ హెడ్‌గా జి. కనిష్క, కో-రైటర్‌గా దరహాస్ పళకొళ్ళు, స్క్రిప్ట్ అసోసియేట్‌గా కె. బాల గణేష్‌ పని చేస్తున్నారు. 
 
సెప్టెంబర్‌ 12కి రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ మరింత దూకుడుగా ప్రమోషన్స్‌ చేయబోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ