Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చంద్రానికి మెగా ఆఫర్.. కొరటాల శివ మూవీలో ఛాన్స్

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (13:27 IST)
చెన్నై చంద్రంగా పేరుగాంచిన హీరోయిన్ త్రిష. ఒకపుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. కానీ, అవకాశాలు తగ్గిపోవడంతో చెన్నైకే పరిమితమైంది. పైగా, ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ కనిపిస్తోంది. కోలీవుడ్‌లో మాత్రం రాణిస్తున్నప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలో ఈమెకు మెగా ఆఫర్ వరించనుంది. 
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పలువురి పేర్లను పరిశీలించారు. ఈ జాబితాలో అనుష్క, శృతిహాసన్, నయనతార, కాజల్ అగర్వాల్, త్రిష అలా అనేక మంది పేర్లు పరిశీలించినప్పటికీ.. చివరకు ఆ ఆఫర్ చెన్నై చంద్రానికి దక్కినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం త్రిష‌ని చిరు 152వ చిత్ర క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా చేశార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉందో ?
 
కాగా, త్రిష చివరగా "96", 'పేట' చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకి కోలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి 'రాంగి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. మ‌రోవైపు కె తిరుగ‌న‌న‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌ర‌మ‌ప‌దం విల‌య‌ట్టు' అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం త్రిష‌కి 60వ మూవీ కావ‌డం విశేషం. సో... చెన్నై చంద్రం తిరిగి గాడిలో పడినట్టేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments