ఎగిరే పావురమా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక లైలా. తొలి చిత్రంతోనే విజయం సాధించడంతో పాటు కుర్రకారు మనసులను ఎంతగానో దోచుకుంది ఈ అమ్మడు. ఉగాది, పెళ్లిచేసుకుందాం, పవిత్రప్రేమ తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించి అప్పట్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
ఇలా ఒక్క తెలుగులోనే కాదండోయ్ తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. 2006 తర్వాత లైలా స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు.
ఇటీవల ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ... తెలుగు చిత్రపరిశ్రమ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అంతటితో ఆగని ఈమె తమిళ చిత్రపరిశ్రమకి ఫస్ట్ మార్కులు.. ఆ తర్వాత టాలీవుడ్‌కు మార్కులేస్తానని చెప్పుకొచ్చింది.
ఎందుకంటే తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించానని.. అందరూ తనను ప్రోత్సహించారని పాత రోజులను ఆమె గుర్తుకు తెచ్చుకుంది.అంతే కాదండోయ్.. తాను మళ్లీ టాలీవుడ్, కోలీవుడ్‌లోకి ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తను నటించబోయే సినిమాకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే... లైలా రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఏంటి..? ఆ సినిమాలో ఆమె పాత్రేంటి..? దర్శకుడు ఎవరు..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.