గద్దలకొండ గణేష్‌గా వాల్మీకి.. తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్.. వరుణ్ ఖాతాలో హిట్టే

శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:14 IST)
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కోలీవుడ్‌లో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కి హిట్ అయిన ఈ సినిమాను హరీష్ శంకర్ రీమేక్ చేశారు. ముందుగా వాల్మీకి అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని కులాలు టైటిల్ మార్చాలన్న అభ్యంతరం పెట్టాయి. దీంతో రిలీజ్‌కు ముందు రోజు వాల్మీకి కాస్త గద్దల కొండ గణేష్‌గా మార్చింది యూనిట్‌.
 
ఈ సినిమాలో గద్దల కొండ గణేష్‌గా వరుణ్ తేజ్ నటించాడు. అధర్వ మురళీ, పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. నైజాంలో గద్దలకొండ గణేష్ మొదటిరోజు 1.7కోట్ల షేర్ సాధించి అబ్బురపరిచింది. ఈ మొత్తం వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ కావడం విశేషం.
 
అలాగే ఈ చిత్రం ఓపెన్సింగ్స్ అదిరిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ.6.81 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ 5.81 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తొలి రోజు వసూళ్లు చూస్తే బాక్సాఫీస్ దగ్గర మరింతగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ కెరీర్‌లో మరో మంచి హిట్ పడినట్టేనని సినీ పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏడేళ్ళ నాటి కేసును తిరగదోడారు... చిక్కుల్లో మోహన్‌లాల్ .. దోషిగా తేలితే జైలే