Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ నగర్‌ గేటుకు కట్టేసి కొడతా.. రష్మీకి నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:21 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్‌కు తెలుగు చిత్ర నిర్మాత నాగలింగం గట్టివార్నింగ్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానంటూ హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరిక చేసింది ఇపుడు కాదు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన "రాజు గారి బంగ్లా" సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తన పట్ల రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించిందని ఆయన తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
నాడు రష్మీతో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన అంశాలను ఆయన తాజాగా వెల్లడించారు. "రాణి గారి బంగ్లా" సినిమా షూటింగ్ సమయంలో రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించారు. సగం సినిమా షూటింగ్ పూర్తయ్యాక హీరోను మార్చాలని పట్టుబట్టారు. సినిమా సగం షూటింగ్ పూర్తయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా ఆమె వినిపించుకోకుండా తనను బెదిరించారు. నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు ఇలా తనను పలువురి పేర్లు చెప్పి బెదిరించారు. దీంతో నేను కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించాను. నీకే కాదు నాక్కూడా చాలా మంది తెలుసు. మర్యాదగా షూటింగ్ పూర్తి చేయకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఫిల్మ్ నగర్ గేట్లను కట్టేసి కొడతానంటూ హెచ్చరించాను. దీంతో ఆమె దిగివచ్చి సినిమా షూటింగ్ పూర్తి చేశారు అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments