Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 February 2025
webdunia

డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

Advertiesment
డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు కన్నుమూశారు. వీరిద్దరి మరణాల నుంచి ఇంకా కోలుకోలేదు. 
 
ఇపుడు తెలుగు చిత్రాల డబ్బింగ్ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మణం పాలయ్యారు. 46 యేళ్ళ జక్కులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర రావు ప్రమాదస్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. ఈయన జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మానాన్నా  ఊరెళితే వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్రినా కైఫ్ పెళ్లికి సల్మాన్ ఖానా? ఛాన్సేలేదు..?