Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్తారింటికి వెళుతూ వరుడు మృతి - ఆస్పత్రిలో వధువు మృతి.. ఎక్కడ?

అత్తారింటికి వెళుతూ వరుడు మృతి - ఆస్పత్రిలో వధువు మృతి.. ఎక్కడ?
, గురువారం, 25 నవంబరు 2021 (15:22 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తమ వివాహం ముగిసిన తర్వాత అత్తారింటికి వధూవరులిద్దరూ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు అక్కడే ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వధూవరులిద్దరూ మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళి అనే యువతితో తిరుపతిలో అట్టహాసంగా వివాహం జరిగింది. అక్కడ నుంచి వధూవరిలిద్దరూ చెన్నైకు కారులో బయలుదేరారు. 
 
ఈ కారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడు ప్రమాదస్థలిలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువును ఆస్పత్రికి తరలించగా, వధువు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌రో అల్ప‌పీడ‌నం... తిరుప‌తివాసులు అప్రమత్తంగా ఉండాలి