Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంక ప్రేమ పెళ్లి పెటాకులేనా? భర్త పేరు తొలగించిన బాలీవుడ్ నటి

Advertiesment
ప్రియాంక ప్రేమ పెళ్లి పెటాకులేనా? భర్త పేరు తొలగించిన బాలీవుడ్ నటి
, మంగళవారం, 23 నవంబరు 2021 (09:14 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బ్రిటీష్ పాప్ సింగ్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి సంసారంలో ఇపుడు సమస్యలు ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రియాకా చోప్రా తన పేరులోనుంచి భర్త నిక్ జొనాస్ పేరును తొలగించింది. ఇపుడు ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ప్రియాంకా చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును "చోప్రాజొనాస్" అని ఉండేది. ఇపుడు జొనాస్ పేరును తొలగించింది. దీంతో రకరకాలైన వార్తా కథనాలు వస్తున్నాయి. వీటిపై ప్రియాంకా చోప్రా మాత్రం పెదవి విప్పకపోగా, ఆమె తల్లి మాత్రం అవి చెత్తవార్తలంటూ కొట్టిపారేశారు. 
 
కాగా, ఇటీవల టాలీవుడ్ స్వీట్ కపుల్‌గా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు తమ వైవాహిక బంధాన్ని స్వస్తిచెప్పిన విషయం తెల్సిందే. అపుడు కూడా తన పేరు నుంచి సమంత ముందుగా భర్త నాగ చైతన్య పేరును తొలగించింది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. 
 
ఇపుడు ప్రియాంకా చోప్రా కూడా ఇదే విధంగా ముందు భర్త పేరును తొలగించింది. ఇపుడు ఈమె కూడా సమంతలాగే భర్తకు విడాకులు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రియాంకా చోప్రా స్నేహితురాలు మాత్రం మరోలా స్పందించారు. 
 
భవిష్యత్తులో ప్రియాంకా చోప్రా చేపట్టబోయే ప్రాజెక్టు కోసమే ప్రియాంకా తన పేరును అలా మార్చుకున్నారని స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం వారిద్దరి వైవాహిక బంధంపై పలు రకాలైన కథనాలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ‌మౌళి విడుద‌లచేసిన కొత్త పోస్ట‌ర్ - 26న జ‌న‌ని పాట వ‌చ్చేస్తుంది